కల చెదిరింది.. వంశీ కథ మారింది!

Publish Date:Feb 26, 2024

Advertisement

రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉన్నా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గన్నవరం, గుడివాడలో మాత్రం రాజకీయం రంజుగా మారుతోంది. గుడివాడలో వైసీపీ అభ్యర్థిగా మళ్లీ కొడాలి నానినే పోటీ చేస్తుండగా.. ఆయన ప్రత్యర్థిగా తెలుగుదేశం నుంచి వెనిగండ్ల రాము బరిలో దిగుతున్నారు. అయితే కొడాలి నాని వరుసగా గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి  వైసీపీ అభ్యర్థిగానే   బరిలో దిగుతుండగా, తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము మాత్రం తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. అంత వరకు ఓకే. 

కానీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం చిత్రం.. విచిత్రంగా ఉంది ఎందుకంటే ఈసారి ఫ్యాన్ వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ,  టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ ఇక్కడ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో..అంటే.. 2019 ఎన్నికలలో వీరిద్దరే ప్రత్యర్థులైనప్పటికీ, ఇప్పుడు వారు పోటీ చేస్తున్న పార్టీలు రివర్స్ అయ్యాయి. అంటే గత ఎన్నికలలో వల్లభనేని వంశీ తెలుగుదేశం అభ్యర్థిగా  పోటీలో ఉంటే, వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ బరిలోకి దిగారు.  విజయం మాత్రం తెలుగుదేశం అభ్యర్థి వంశీనే వరించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ  151 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని జగన్ ముఖ్యమంత్రి కావడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగి.. జగన్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. 

ఆ తర్వాత.. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీలోనే అటు యార్లగడ్డ వెంకట్రావ్ వర్గం, ఇటు వల్లభనేని వంశీ వర్గం ఏర్పడి.. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అందులో నుంచి అసమ్మతి రాగం పుట్టుకొచ్చింది. అది మిన్నంటింది. దాంతో యార్లగడ్డ వెంకట్రావ్ వైసీపీకి గుడ్ బై చెప్పి.. తెలుగుదేశం గూటికి చేరిపోయారు. అలా పార్టీలోకి వచ్చిన కొద్ది రోజులకే.. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీగా యార్లగడ్డను  తెలుగుదేశంఅధినేత చంద్రబాబు  నియమించారు. దీంతో నాడే గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ పేరు ఖరారు అయింది.  

అయితే గన్నవరం నియోజకవర్గం అంటే.. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో మళ్లీ తెలుగుదేశం జెండానే రెపరెపలాడుతుందనీ, ఆ పార్టీ  ఆవిర్భావం నుంచి నియోజకవర్గ ప్రజలు.. దాదాపుగా ఆ పార్టీకే పట్టం కడుతూ వస్తున్నారని.. అలా పట్టం కట్టితేనే.. వరుసగా రెండు సార్లు వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలుపొందారని.. కానీ గత ఎన్నికల తరువాత అధికారం మారడంతో.. ఆయన మనస్సు కూడా మారిందని.. కానీ నియోజకవర్గ ప్రజల మనస్సులు మాత్రం చెక్కు చెదరకుండా.. తెలుగుదేశం  వైపే ఉందని,  దీంతో గన్నవరంలో వరుసగా సైకిల్ పార్టీ జెండా రెపరెలాడుతోందని... అందుకే ఈ సారి గెలిచేది.. ఎమ్మెల్యే పదవి చేపట్టేది మాత్రం యార్లగడ్డ వెంకట్రావేనన్న  స్థానికుల్లో హల్‌చల్ చేస్తోంది. 

మరోవైపు వల్లభనేని వంశీ పార్టీ మారితే మారాడు.. తనతో పాటు పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు నోరు మూసుకోని ఉన్నట్లు ఉండకుండా.. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  దీంతో ఆ రోజే.. వంశీ పోలిటికల్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పడిందని,  దీంతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమైందనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అయిందని స్థానికులు ఈ సందర్బంగా    గుర్తు చేస్తున్నారు. ఏదీ ఏమైనా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ గెలుపు.. అంటే యార్లగడ్డ వెంకట్రావ్ గెలుపు ఖాయమైందనే ఓ ప్రచారం సైతం స్థానికంగా జోరుగా సాగుతోంది. 

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.