15 ఏళ్ల వయసులో 5 అవార్డులు.. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీని నడిపించిన ఆ గురువు ఎవరు?

Publish Date:Jun 4, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒకే ఒక్క పేరు క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది. అదే 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు సృష్టించిన బిహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ  బేబీ బాస్ ఏకంగా 16 మ్యాచ్‌లలో 237.30 భారీ స్ట్రైక్ రేట్‌తో, 48.50 అద్భుతమైన సగటుతో 776 పరుగులు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాడు. కేవలం 440 బంతుల్లోనే 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసి విండీస్ పవర్‌హౌస్ ఆండ్రీ రస్సెల్ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. అతి పిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్ సాధించిన ఈ కుర్రాడు.. టోర్నీ ముగిసేసరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP), ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, ఆరెంజ్ క్యాప్, మరియు సూపర్ సిక్సెస్ వంటి ఐదు ప్రతిష్టాష్టాత్మక అవార్డులను ఒకేసారి తన ఖాతాలో వేసుకుని చరిత్రకెక్కాడు. అయితే, మైదానంలో పరుగుల వరద పారించిన ఈ 15 ఏళ్ల బాల సంచలనం వెనుక, ఐపీఎల్ ఆసాంతం ఒక వ్యక్తి నీడలా వెంట నడిచారు. ఆ ఆసక్తికరమైన మెంటార్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో డగౌట్ కావచ్చు, బౌండరీ లైన్ వెనుక కావచ్చు, అహ్మదాబాద్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత లేదా ప్రెజెంటేషన్ వేడుకల్లో కావచ్చు, చివరకు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలను కలిసిన సందర్భాల్లోనూ వైభవ్ పక్కనే ఒక వ్యక్తి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్ అయి వైభవ్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు, అతడిని ఒక తండ్రిలా ఓదార్చి వెన్నుతట్టిన ఆ వ్యక్తి మరెవరో కాదు, రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్. వైభవ్‌కు ఒక గార్డియన్‌గా, మెంటార్‌గా వ్యవహరిస్తూ.. ఈ 15 ఏళ్ల చిన్నారిని క్రికెట్ ఒత్తిళ్ల నుంచి కాపాడుతూ వచ్చారు. రోమి భిందర్ సాధారణ వ్యక్తి కాదు; గతంలో ఇంగ్లాండ్‌లో క్లబ్ క్రికెట్ ఆడటంతో పాటు విదర్భ, మహారాష్ట్ర, నాగ్‌పూర్ యూనివర్సిటీల తరఫున జిల్లా స్థాయిలో ఆడిన అపార అనుభవం ఆయనకుంది. వరల్డ్ క్రికెట్ అకాడమీతో అనుబంధం కలిగి ఉండి, నాగ్‌పూర్ సమీపంలో ఒక అత్యాధునిక రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీని సైతం ఏర్పాటు చేస్తున్నారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా ఐపీఎల్‌తో ముడిపడి ఉన్న రోమి భిందర్, రాజస్థాన్ రాయల్స్ మొదటి సీజన్‌లో లైజన్ ఆఫీసర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్‌గా, ఇప్పుడు కీలకమైన టీమ్ మేనేజర్‌గా ఎదిగారు. స్పోర్ట్స్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన రోమి భిందర్‌కు, యువ ఆటగాళ్లను మానసికంగా ఎలా సిద్ధం చేయాలో చాలా బాగా తెలుసు. అందుకే వైభవ్‌ను ఒత్తిడికి లోనుకాకుండా నిలబెట్టగలిగారు. ఈ ప్రయాణంలో ఒక వివాదం కూడా రేగింది. గువాహటిలో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో వైభవ్ పక్కన కూర్చుని మొబైల్ ఉపయోగించినందుకు బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి, ఒక లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే, వైద్య కారణాల వల్లే అత్యవసరంగా ఫోన్ వాడాల్సి వచ్చిందని గుర్తించిన బోర్డు, ఆయన సుదీర్ఘ అనుభవాన్ని గౌరవిస్తూ కేవలం హెచ్చరికతో ఆ కేసు ముగించింది, పక్కనే ఉన్న వైభవ్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకుంది.

ఐపీఎల్ ముగించుకుని వైభవ్ తన స్వగ్రామానికి చేరుకున్నప్పుడు కూడా రోమి భిందర్ బాధ్యతాయుతమైన మెంటార్‌గా వ్యవహరించారు. వైభవ్‌ను చూడటానికి అభిమానులు, మీడియా భారీ ఎత్తున తరలి వచ్చి, పూల వర్షం కురిపిస్తూ నినాదాలు చేస్తున్న ఆ కంగారులో.. జనం నుంచి రక్షణ కల్పిస్తూ వైభవ్‌ను సురక్షితంగా కారు వైపు నడిపించారు. జనం కారును చుట్టుముట్టడంతో డోర్ వేయడానికి ఇబ్బంది పడినప్పటికీ, రోమి దగ్గరుండి అంతా చక్కదిద్దారు. ఈ ప్రయాణంలో లెజెండ్స్ ప్రశంసలను కూడా రోమి పంచుకున్నారు. ఎంఎస్ ధోని వైభవ్‌ను చూసి ఈ పిల్లాడు ఎంతో పరిణతి చెందిన ఆటగాడిలా షాట్లు ఆడతాడు అని మెచ్చుకోగా, విరాట్ కోహ్లీ వైభవ్‌ను ప్రత్యేకంగా వెతుక్కుంటూ వచ్చి, ఎల్లప్పుడూ వినయంగా ఉంటూ కష్టపడాలని అమూల్యమైన సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం త్వరలోనే శ్రీలంకలో జరగబోయే ఇండియా-ఏ, శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్ల త్రైపాక్షిక వన్డే సిరీస్‌కు వైభవ్ సిద్ధమవుతుండగా, అతని ఎదుగుదల వెనుక ఉన్న రోమి భిందర్ సేవలను క్రికెట్ ప్రపంచం కొనియాడుతోంది.

By
en-us Political News

  
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.