నోరు జారిన నేరానికి...!

Publish Date:Mar 17, 2025

Advertisement

కాలు జారితే, వెనక్కి తీసుకోవచ్చును, కానీ, నోరు జారితే వెనక్కి తీసుకోలేము. ఒక్కొక్క సారి, నోరు జారిన నేరానికి, భారీ మూల్యమే చెల్లించుకోవలసివస్తుంది, ఉత్తరాఖండ్’ ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల మంత్రి, ప్రేమ్ చంద్ అగ్రవాల్ విషయంలో అదే జరగింది. అవును. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో,ఆయన,రాష్ట్రమంటే కేవలం’ పహాడీలు’ (గిరిజనులు) మాత్రమే కాదు,అంటూ గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆతర్వాత ఆయన, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  లాగా చాలా చాలా వివరణ ఇచ్చుకున్నారు. అయినా కొంచెం ఆలస్యంగానే అయినా, రాజీనామా చేయక తప్పలేదు. ఆదివారం (మార్చి 16) ఆయన మంత్రి పదవికి రాజీనామా  చేశారు. 

ఇలా తెలిసీ, తెలియకో, కొండకచో  నోటి తీటతో నోరు జారి, చిక్కుల్లో చిక్కుకున్న పెద్దలు, చిన్నలు చాలామందే ఉన్నారు. ఆ మధ్యన శ్యాం పిట్రోడా అనే కాంగ్రెస్ పెద్దాయన, లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరు మీదున్న సమయంలో, చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. శ్యాం పిట్రోడా ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో ఏమో కానీ..  దేశం తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బుల్లా, ఉత్తరాది వారు శ్వేత జాతీయులుగా, చివరగా దక్షిణాది ప్రజలు అఫ్రికన్స్’లా ఉంటారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటికే వారసత్వ సంపద గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అందుకు ఆయన మూల్యం చెల్లించారు. ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఎన్నికల క్రతువు ముగిసిన తర్వాత  కాంగ్రెస్ పార్టీ  ఆయన్ని మళ్ళీ అదే పదవిలో కుర్చోపెట్టిందనుకోండి అది వేరే విషయం. 

అలాగే, 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాయిన్’ చేసిన చోకీదార్ చోర్  నినాదం ఆయన్ను రాజకీయంగానే కాదు, చట్టపరంగానూ చిక్కుల్లోకి నెట్టింది. రాహుల్ గాంధీ ప్రధాని మోదీని దేశం ముందు దొంగగా చూపించేందుకు తమ ఆరోపణను, అభిప్రయాన్ని కోర్టుకు అపాందించారు. కోర్టు చేయని వ్యాఖ్యలను చేసినట్లు ప్రచారం సాగించారు. న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు.  ఒకసారి కాదు రెండు సార్లు సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. రాహుల్ గాంధీ ఇలా నోరు జారిన నేరానికి, ఆయన చెల్లించిన మూల్యం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి రెండు అంకెలకు పరిమితం అయింది. పార్టీ ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఇలా ఒకరిద్దరు కాదు, నోటి తీటా రాజకీయ నేతల చిట్టా చాలా వుంది. ఎక్కడి దాకానో ఎందుకు, మొన్నటి 2024 ఎన్నికలకు ముందు  బీజేపీ అధ్యక్షుడు, జేపీ నడ్డా  బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్,(ఆర్ఎస్ఎస్) అవసరం తమకు లేదంటూ చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపాయో, చెప్ప నక్కర లేదు. సరే  ఆ తర్వాత బీజేపీ దిద్దుబాటు చర్యలు తీసుకుని,ఇటీవల జరిగిన, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ సహా మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. అలాగే, హర్యానా, గుజరాత్ సహా ఐదారు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో క్లీన్  స్వీప్ చేసింది.  

అలాగే కేంద్ర హోం మంత్రి అమిత షా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్’ గురించి రాజస్య సభలోచేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో చెప్పనవసరం లేదు. రాజ్యాంగ వజ్రోత్సవాలను పురస్కరించుకుని  రాజ్య సభలో చేపట్టిన ప్రత్యేక చర్చకు సమాధానం ఇస్తూ అమిత్ షా ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి, అంబేద్కర్, అంబేద్కర అనడం వాళ్ళకు ఒక ఫాషన్ అయి పోయింది. అంబేద్కర్ పేరు ఉచ్చరించినన్ని  సార్లు భగవత్ నామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల పాటు స్వర్గమైనా దక్కేది  అంటూ చేసిన వ్యాఖ్యలు, పార్లమెంట్ లోపలా వెలుపలా ప్రకంపనలు సృష్టించాయి. ఎంతో దుమారాన్ని రేపాయి. విపక్షాలు హోం మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. ఆయన్ని బర్తరఫ్ చేయాలని పట్టు పట్టాయి.  పార్లమెంట్ ప్రాంగణంలో ఇంతవరకు ఎప్పుడూ చూడని నిరంతర నిరసన ప్రదర్శనలు, తోపులాటలు, తొక్కిసలాటలు, గౌరవ  ఎంపీలు గాయాలతో ఆసుపత్రుల పాలుగావడం వంటి    తతంగం చాలా చాలా జరిగింది. ఇంచుమించుగా వారం రోజులకు పైగానే, పార్లమెంట్ సమావేశాలు, ఆ దుమారంలో కొట్టుకు పోయాయి. అమిత షా రాజీనామా చేయలేదు, ప్రధానమంత్రి ఆయనని  బర్త్ రఫ్  చేయలేదు కానీ  రాజ్యాంగ వజ్రోత్సవాలను ఘనంగా  నిర్వహించి క్రెడిట్ కొట్టాయాలని చూసిన బీజేపీ లక్ష్యం మాత్రం నెరవేర లేదు. పార్టీ ఇమేజ్  పక్కకు వాలింది. దేశీయంగానే కాదు అంతర్జాతీయంగానూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ  బోనులో నిలబడింది.  ఇక మన దగ్గరకు వస్తే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేతల దురుసు తనానికి హద్దులే లేవు. అది రుజువైన వాస్తవం. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో  ముఖ్యమంత్రి సహా మంత్రులు, భాష విషయంలో ఎంతగా దిగ జారారో,ఎంతగా నోటిని పారేసుకున్నారో,  ఎన్నెన్ని బూతు నిఘంటువులు సృష్టించారో వేరే చెప్ప నక్కరలేదు. అలాగే అందుకు  వైసీపీ చెల్లించిన మూల్యం గురించి కూడా చెప్ప నవసరం లేదు.  

ఇక ఇప్పడుతాజాగ , ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేతలు నోరు జారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ గురించి చేసిన, స్టేచర్  - స్ట్రెచర్ - మార్చురీ  వ్యాఖ్యలు.. దానికి అనుబంధంగా ఇచ్చిన వివరణ, కొనసాగింపుగా  సోషల్ మీడియా విశృంఘలత్వం పై విరుచుకు పడుతూ,  బట్టలు ఊడదీసి... అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు, నోరు జారిన  రోత మాటలు,మళ్ళీ మళ్ళీ తెర మీదకు వస్తున్నాయి. 

దీంతో ఇప్పటికే ఓ వంక అంతర్గత రాజకీయ సంక్షోభం, మరో వంక ఆర్థిక సంక్షోభంతో పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ రోజు కాక పోయినా రేపు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం  ప్లస్ అండ్ మైనస్  లెక్కల బాలన్స్ షీట్ స్క్రూటినీకి వచ్చినప్పడు, ఆయన  ఖాయంగా మూల్యం చెల్లించవలసి రావచ్చును.   

అలాగే ఆంధ్ర అప్రదేశ్  లోనూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జన సేన అధినేత పవన్ కళ్యాణ్’, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగ బాబు పిఠాపురం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో  చేసిన వివాదస్పద వ్యాఖ్యలు కూటమిలో కుంపట్లు పెట్టాయి. అనుభవ రాహిత్యంతో పాటు అజ్ఞానం తోడైన అహంకారంతో  అన్నదమ్ములు చేసిన వ్యాఖ్యలు కూటమిలో కుంపట్లు రాజేసాయి. ఇంతవరకు సజావుగా సాగుతున్న కుటుంబంలో చిచ్చు పెట్టాయి. సినిమాల్లో  డూప్  లు చేసిన ఫైట్లు చూసి  హీరోలే ఫైట్  చేశారని  అభిమానులు ఈలలు వేస్తారు. చప్పట్లు కొడతారు. హీరోలకు తాము జీరోలమని తెలుసు. అయినా  విజయోత్సవ వేడుకల్లో వేదికలు ఎక్కి  చేతులు ఊపుతారు. సక్సెస్  సొంతం చేసుకుంటారు.  అలా  తమను తాము మోసం చేసుకుంటూ, అభిమానులను మోసం చేస్తారు. రాజకీయాల్లోనూ అదే  హీరోయిజం’ చుపిస్తామంటే కుదరదు. 

కానీ  కొణిదెల సోదరులు  పిఠాపురంలో  కూటమి గెలుపును తమ ఖాతాలో వేసుకుని  హీరో ఫోజులు ఇచ్చే విఫల ప్రయత్నం చేశారు. బండి కింద నడిచి వెళ్లే కుక్క పిల్ల బండి భారం మొత్తం తానే మోస్తున్నానని ఫీల్  అవుతుందంటే అర్థం చేసుకోవచ్చును, కానీ  వారనే కాదు,  రాజకీయ నాయకులు ఎవరైనా అదే ఫీలింగ్  లో ఉంటే, ఆ వైభోగం అట్టే కాలం నిలవదు. సంకీర్ణ  రాజకీయాల్లో చేయి చేయి కలిస్తేనే చప్పట్లు... లేదంటే చిత్కారాలు చీవాట్లు తప్పవు. అందుకే, నోటి తీట పొట్టకు చేటని  అంటారు.

By
en-us Political News

  
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.