హరీష్ పన్నెండు ప్రశ్నలు.. ఉత్తమ్ ధీటైన సమాధానం
Publish Date:Oct 11, 2018
Advertisement
కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు షరమ్ లేని పొత్తు అని తెరాస సీనియర్ నేత హరీష్ రావు విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేకాదు అసలు టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 12 ప్రశ్నలు సంధించారు. ఉత్తమ్ దీనికి అంతే ధీటుగా బదులిస్తూ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. హరీష్ రావు నాకు రాసిన లేఖలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ తేల్చేశారు.. హరీష్ రావు లేఖతో ఇప్పటివరకూ కేసీఆర్ చెబుతున్న వందసీట్ల కల చెదిరిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, తెరాస ఓటమిని ముందుగానే అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నానన్నారు. కాంగ్రెస్ పొత్తుపై హరీశ్‌రావు సంధించిన 12 ప్రశ్నల్లో ఒక్కటీ తెలంగాణ సమాజానికి పనికొచ్చేది లేదని.. అవన్నీ తెరాస ప్రభుత్వం చేతగానితనాన్ని, పాలనా వైఫల్యాన్ని బయటపెడుతున్నాయని విమర్శించారు. తమ పొత్తు గురించి తెరాస పడుతున్న ఆందోళన చూస్తుంటే వారి పాలన పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. వారి పాలనే బాగుంటే తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామన్న ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో 2004లో, టీడీపీతో 2009లో తెరాస పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. టీడీపీతో 2009లో పొత్తు పెట్టుకున్నప్పడు ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని తేల్చిచెప్పిన తర్వాత.. ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ ఎలా అయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీవి షరమ్ లేని పొత్తులు కావని, తెరాసే షరమ్‌లేని పొత్తులు పెట్టుకుందని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించి.. రాయల తెలంగాణ డిమాండ్ చేసిన ఎంఐఎంతో తెరాస స్నేహమెలా చేస్తోందని నిలదీశారు. ఒంటరిగా పోటీ చేసి కూడా తెరాసను చిత్తుగా ఓడించే సత్తా కాంగ్రెస్ కి ఉందని, అయినా.. తెలంగాణను రక్షించుకోవడం కోసం సిద్ధాంత సారూప్యం ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ వారు ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకేంటి? అంటూ గతంలో కేసీఆర్ అన్నారు. మరి మేం ఎవరితో పొత్తు పెట్టుకుంటే వారికేంటి. ప్రజలకే మేం జవాబుదారులం. ప్రజలకు జవాబు చెప్పుకొనే శక్తి మాకు ఉంది. మా పొత్తుల విషయంలో ఎందుకు అంతగా భయపడుతున్నారు? అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఉత్తమ్ లేఖలోని ముఖ్యాంశాలు:
http://www.teluguone.com/news/content/uttam-kumar-reddy-replies-to-harish-rao-letter-37-83838.html





