రష్యా చమురు కొనుగోలుపై భారత్‌కు బిగ్ షాక్
Publish Date:Aug 8, 2026
Advertisement
అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని, ముఖ్యంగా భారత్-అమెరికా దౌత్య సంబంధాలను ప్రభావితం చేసేలా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై వంద శాతం టారిఫ్ లు విధించడానికి అమెరికా సెనెట్ ఆమోదముద్ర వేసింది. ఉక్రెయిన్‌తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా ఆ చర్య తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఇండియా, చైనా వంటి దేశాలకు అమెరికా నిర్ణయం నిస్పందేహంగా షాకే. అమెరికా నిర్ణయం ప్రపంచ ఇంధన మార్కెట్‌తో పాటు భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. అమెరికా సెనెట్‌లో ఇటీవల జరిగిన ఓటింగ్ లో శాంశనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026 బిల్లుపై చర్చ జరిగింది. చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో ఈ బిల్లు 86-11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. సెనెట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లుఈ నెల 31న అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రానుంది. లోయర్ హౌస్‌లో కూడా ఆ బిల్లు ఆమోదం పొందితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టంగా మారి అమల్లోకి వస్తుంది. ఈ ఆంక్షల బిల్లు అమలులోకి వస్తే.. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై వంద శాతం సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం భారత్, చైనా, స్లొవేకియా, హంగరీ, అజర్బైజాన్ వంటి దేశాలపై తీవ్రంగా ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే ధ్యేయంగా రష్యా రక్షణ, ఆర్థిక, ఇంధన వ్యవస్థలను ఒంటరి చేయాలనే అమెరికా ప్రణాళికలో భాగంగానే ఈ బిల్లు తీసుకువచ్చినట్లు అమెరికా చెబుతోంది. అందులో భాగంగానే రష్యా చమురును కొనుగోలు చేస్తూ మాస్కో ఖజానాకు విదేశీ మార్పిడి నిధులను సమకూరుస్తున్న దేశాలపై భారీ టారిఫ్ లకు అమెరికా రెడీ అవుతోంది. భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు కీలక దశలో ఉన్న తరుణంలో ఈ బిల్లు ఆమోదం పొందడం ప్రాధాన్యత సంతరించుకుంది. US Tariffs on India, Russian Oil Imports, US Senate Russia Sanctions Bill 2026, Donald Trump Tariffs, India US Trade Relations, Sanctioning Russia and Iran Act
http://www.teluguone.com/news/content/us-tariffs-on-india-36-228366.html





