నాలుగేళ్ల కొడుకుని తండ్రి నేలకేసి కొట్టిన ఘటనలో.. చిన్నారి మృతి..!

Publish Date:Aug 9, 2026

Advertisement

 

గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 5న చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన విషాదాం తమైంది. తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడు అర్మాన్ ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ విభేదాల నేపథ్యంలో సల్మాన్ (25) తన నాలుగేళ్ల కుమారుడు అర్మాన్‌ ను తీసుకొని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 104 సమీపంలో బాలుడి తల ను పిల్లర్‌కు బలంగా కొట్ట డంతో పాటు, పైకి ఎత్తి నేలపై పడేసినట్లు స్థాని కులు తెలిపారు. 

అనంతరం బాలుడిని లారీ కిందకు నెట్టేందుకు సల్మాన్ ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సల్మాన్‌ను అడ్డుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని అతడి చెర నుంచి రక్షించి, నిందితుడిని పట్టుకుని గుడిమల్కాపూర్ పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో ఉన్న అర్మాన్‌ను వెంటనే నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. ఆగస్టు 5 నుంచి వైద్యులు బాలుడికి చికిత్స అంది స్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో అర్మాన్ మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన బాలుడు చివరకు ప్రాణాలు కోల్పో వడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అర్మాన్ మృతిపై సల్మాన్ సోదరుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సల్మాన్‌కు తమ కుటుం బంలో ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీస్ కమిషనర్, ప్రభుత్వాన్ని కోరారు. సల్మాన్ తరచూ డ్రగ్స్, ట్యాబ్లెట్లు, మద్యం సేవించే వాడని, అతడి ప్రవర్తన కారణంగా కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని సోదరుడు ఆరోపించారు. 

పెళ్లి తర్వాత సల్మాన్ తన కుటుంబానికే కాకుండా తమకు కూడా తీవ్ర సమస్యగా మారాడని తెలిపారు. సల్మాన్ మా జీవితాలను నరకంగా మార్చాడు. అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. బాలుడిపై దాడి చేసిన అతడిని జైలుకు పంపించి కఠినంగా శిక్షించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై గుడిమల్కా పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి మృతితో కేసులో తదుపరి చర్యలపై పోలీసులు దృష్టి సారించారు.

Four yearold boy Armaan, Salman, Gudimalkapur Police, PVNR Express,  CM Revanth reddy, Nilofer Childrens Hospital, CP Sajjanar

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్‌ రాజకీయంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి.. కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్.. !
ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహం కాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా మారబోతోంది.
మహారాష్ట్రలోని పూణే జిల్లా, బారామతి ప్రాంతం మరోసారి విమాన ప్రమాదంతో ఉలిక్కిపడింది.
విజయవాడ నగరం వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ మాస బోనాల పండుగ హైదరాబాద్ నగరం అంతటా అత్యంత కోలాహలంగా, అంగరంగ వైభవంగా సాగుతోంది.
మెడికోపై కారు దాడి కేసు.. అది ప్రమాదం కాదు..!
సెలవుపై స్వగ్రామానికి బయల్దేరిన సైనికుడు..మిస్సింగ్‌పై అనుమానాలు..!
విద్యార్థులకు కళాత్మక తయారీ మరియు ప్రదర్శనలో శిక్షణ నిచ్చే తీరుపై మ్యూజియం నిర్వహుకులతో చర్చించారు.
భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సవ శోభ ఉప్పొంగుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
పాతబస్తీలో ఘనంగా బోనాల పండుగ శోభ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.