అమెరికా రెండో విడత క్షిపణి దాడులు.. ఇరాన్ ప్రతిదాడులు.!

Publish Date:Jul 15, 2026

Advertisement

పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి.  అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కి చేరాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైన్యం  రెండో విడత  వైమానిక, క్షిపణి దాడులు చేపట్టింది.   హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్  ప్రకటించింది. అమెరికా సైన్యం బుధవారం (జులై 15)  తెల్లవారుజామున ఒకసారి,   మధ్యాహ్నం మరోసారి రెండు  విడతలుగా ఇరాన్ సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. 

అమెరికా వైమానిక దళం  గ్రేటర్ టున్బ్ ద్వీపంలోని ఇరాన్ తీరప్రాంత రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించింది. ఇరాన్‌కు చెందిన క్రూజ్ క్షిపణుల నిల్వ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా యుద్ధ విమానాలు క బాంబుల వర్షం కురిపించాయి. మొదటి విడత దాడి దాదాపు గంటన్నర సేపు సాగింది. అనంతరం, హర్మూజ్ జలసంధిలో  ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు అమెరికా నావికా, వైమానిక దళాలు రెండో విడత దాడులకు పాల్పడ్డాయి. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా నావికా దళం ఆంక్షలను పునరుద్ధరించిన నేపథ్యంలో ఈ తాజా దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.

 అమెరికా జరిపిన ఈ భీకర దాడులకు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్  కూడా అంతే  దీటుగా స్పందించింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సైన్యం జోర్డాన్, బహ్రెయిన్లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా  దాడులకు తెగబడింది. జోర్డాన్‌లోని అల్-అజ్రక్ అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన భారీ దాడిలో అక్కడ నిలిపి ఉంచిన అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్-15, ఎఫ్-16, అలాగే  ఎఫ్-35 యుద్ధ విమానాలతో పాటు ఎంక్యూ-9 వ్యూహాత్మక డ్రోన్లు భారీ సంఖ్యలో ధ్వంసమయ్యాయి. 

మరోవైపు..  బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ స్థావరాన్ని కూడా ఇరాన్ ఐఆర్‌జీసీ బలగాలు క్షిపణులతో టార్గెట్ చేశాయి. బహ్రెయిన్ లోని అమెరికా బేస్ లో ఉన్న ఇంధన నిల్వ కేంద్రాలు, సైనిక సామగ్రిని దాచిన పెద్ద పెద్ద గిడ్డంగులపై ఇరాన్ సైన్యం క్షిపణులతో  చేసిన దాడుల్లో..  భారీ  ఆస్తి నష్టం సంభవించింది.  

US airstrikes on Iran, Strait of Hormuz conflict, Iran missile retaliation, Jordan US military base attack, IRGC attacks Bahrain base

By
en-us Political News

  
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.