అమెరికా ఇరాన్ ఒప్పందం ఆమోదయోగ్యం కాదు.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు

Publish Date:Jun 15, 2026

Advertisement

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన  శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి వాషింగ్టన్-టెహ్రాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడం, కుదరకపోవడంతో సంబంధం లేకుండా..  ఇరాన్ అణ్వాయుధాన్ని  సాధించడాన్ని ఇజ్రాయెల్ ఎప్పటికీ అంగీకరించదని తేల్చిచెప్పారు. 

 జెనీవా వేదికగా అమెరికా-ఇరాన్ దేశాలు అధికారిక శాంతి పత్రాలపై ఈ నెల 20న సంతకాలు చేయడానికి  సంతకాలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు  కలకలం స‌ృష్టిస్తున్నాయి. ఈ  ఒప్పందంలో తక్షణ కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధి పునఃప్రారంభంతో పాటు.. ఇరాన్ అణు పరిమితులపై రాబోయే 60 రోజుల్లో చర్చలు జరపాలని అమెరికా భావిస్తోంది. అయితే, ఇరాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడంలో ఈ ఒప్పందం విఫలమైందని  నెతన్యాహు అన్నారు.   
ఈ   ఒప్పందంలోని కొన్ని నిబంధనల తాము అంగీకరించబోమని కుండబద్దలు కొట్టేశారు.   దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో   వ్యూహాత్మక స్థావరాల నుంచి తమసైన్యాన్ని వెనక్కి పిలిపించే ప్రసక్తే లేదని  నెతన్యాహు స్పష్టం చేశారు. తమ దేశ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవడానికి ఆ ప్రాంతంలో  సెక్యూరిటీ జోన్లను' కొనసాగించడం ఇజ్రాయెల్‌కు అత్యంత అవసరమనిసపేర్కొన్నారు. ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే.. ఇజ్రాయెల్ ఆర్మీ..  దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులకు దిగింది.  
 
అయితే నెతన్యాహు వైఖరి పట్ల ఇజ్రాయెల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది.  యుద్ధాన్ని ఆపడానికి అమెరికా ప్రయత్నిస్తుంటే, నెతన్యాహు మొండివైఖరి వల్ల ఇజ్రాయెల్ ఒంటరి అయ్యే ప్రమాదం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్గత రోడ్లు నిర్మాణ పరిస్థితిపై... టోన్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ స్టేట్మెంట్ నమోదు..
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎపై గెలిచిన భారత్-ఎ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది
ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్ చేసిన వాసుదేవ రెడ్డి, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈడీ కోర్టును ఆశ్రయించారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఝార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
ప్రతీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ...
రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ కేసులో కస్టడీ విచారణ ముమ్మరం...
కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకార సంఘాలకు కీలక సూచనలు చేశారు
క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్‌లకు నోటీసులు పంపిన TCA..
హైదరాబాద్‌ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం తగ్గిపోతున్నా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల రెట్లు విస్తరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.