కుప్ప కూలిన అమెరికా బీ52 బాంబర్.. ఎనిమిది మంది మృతి!

Publish Date:Jun 16, 2026

Advertisement

అమెరికా రక్షణ రంగ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన,  యుద్ధ విమానంగా పేరుగాంచిన బీ 52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం  కుప్పకూలింది. కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన ఈ  ప్రమాదం  అమెరికా వైమానిక దళాన్ని,  అంతర్జాతీయ రక్షణ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.  ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఎనిమిది మంది రక్షణ సిబ్బంది  దుర్మరణం పాలయ్యారు. ఎయిర్‌బేస్ రన్‌వేపైనే ఈ భారీ యుద్ధ విమానం కుప్పకూలింది. 

 సాధారణ టెస్ట్ మిషన్‌లో భాగంగా ఈ భారీ బాంబర్ విమానం రన్‌వే నుంచి గాల్లోకి టేకాఫ్ అయింది. అయితే..  టేకాఫ్  నిముషాల వ్యవధిలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో రన్‌వే సమీపంలోనే అత్యంత వేగంగా భూమిని ఢీకొట్టింది. విమానం కూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.  పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా  దట్టమైన, నల్లటి పొగ అలుముకుంది.  సమాచారం అందుకున్న వైమానిక దళ రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభిం చినప్పటికీ లాభం లేకపోయింది.

412వ టెస్ట్ వింగ్ డిప్యూటీ కమాండర్ కల్నల్ జేమ్స్ హేస్ ఈ ఘోర ప్రమాదాన్ని  ధ్రువీకరించారు. విమానం  ప్రమాదానికి గురైందని, లోపల ఉన్న వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదనీ పేర్కొన్నారు.  మరణించిన ఆ ఎనిమిది మందిని  గొప్ప అమెరికన్లు గా అభివర్ణిస్తూ వారికి నివాళులర్పించారు. మృతుల్లో అమెరికా సైనిక సిబ్బందితో పాటు, రక్షణ రంగానికి చెందిన   సాంకేతిక నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉన్నారు.  

అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే..  అమెరికా ఎయిర్ ఫోర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన  రాడార్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ విమానం ప్రయోగాత్మక ప్రయాణం చేస్తోంది.  యుద్ధ విమానాల్లో అత్యంత కీలకమైన  యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే ఏఈఎస్ఏ   అనే సరికొత్త అత్యాధునిక రాడార్ వ్యవస్థ పనితీరును పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ అత్యున్నత సాంకేతిక రాడార్ టెస్టింగ్ సమయంలోనే విమానం నియంత్రణ కోల్పోయి ఉంటుందని  భావిస్తున్నారు.

ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అన్వేషించడానికి అమెరికా రక్షణ శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. . అణు ఆయుధాలతో పాటు సంప్రదాయ ఆయుధాలను భారీ మొత్తంలో మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న  బీ 52 యుద్ధ విమానాలు దశాబ్దాలుగా అమెరికా వైమానిక శక్తికి వెన్నెముకగా నిలిచాయి. 

By
en-us Political News

  
సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి ప్రసంగం..
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
మెట్రో ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు
తెలంగాణలో హెచ్‌సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టీజీ 20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెల్‌లో ఏపీదే పేటెంట్..
రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంటల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2026 ఆషాఢ మాస బోనాల జాతర నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆలయ అధికారులు ఖరారు చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న ఈగల్ ఫోర్స్ అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసింది.
హనీమూన్ ప్రయాణం అంటే సరికొత్త జీవితానికి అందమైన పునాది.
దేశ రక్షణలో కీలకమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అధికారిక విధుల్లో బిజీగా ఉండే ఒక ఉన్నతాధికారి కుటుంబంలో నమ్మశక్యం కాని ఘోరం వెలుగుచూసింది.
హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు పోలీసు శాఖ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది.
వాహన్ సారథి సాఫ్ట్‌వేర్ అకస్మాత్తుగా షట్‌డౌన్ అవ్వడంతో దానికి సంబంధించిన డిజిటల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ సాంకేతిక వైఫల్యంపై క్షేత్రస్థాయి అధికారులు ఈ సమస్య పరిష్కారం మా చేతిలో లేదంటూ చేతులెత్తేయడంతో వినియోగదారులు లబోదిబో మంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.