యూపీలోని గోండాలో ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది యాత్రికులతో వెళ్లున్న బొలెరో అదనపు తప్పి కెనాలోకి దూసుకెళ్లింది. ఈఘటనలో 11 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. పృథ్వినాథ్ ఆలయానికి భక్తులను తీసుకెళుతున్న బొలేరో వాహనం అదపుతప్పి కాల్వలో బోల్తాపడింది. ఈ ప్రమాదం పరాసరాయ్-ఆలవాల్ డియోర మార్గంలోని రేహారి గ్రామం సరయూ కాల్వ వంతెన వద్ద చోటు చేసుకొంది.సరయూ నది నుంచి మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రమాదం జరిగే సమయానికి వాహనంలో 15 మంది యాత్రికులు ఉన్నారు. నలుగురు వ్యక్తులను స్థానికులు కాపాడినట్లు పేర్కొన్నారు. మృతులు మోతీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహాగావ్ నివాసితులు. వీరిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. బీనా (35), కాజల్ (22), మహాక్ (12), దుర్గేష్, నందిని, అంకిత్, శుభ్, సంజు వర్మ, అంజు, సౌమ్య వంటి వారు ఈ ప్రమాదంలో మరణించారు. ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ఈ దుర్ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు చెప్పిన ప్రకారం, కారు డోరు తెరుచుకోక పోవడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. లోపల ఉన్నవారు తమ ప్రాణాల కోసం వేడుకున్నా, కారు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించే ప్రయత్నం జరిగినప్పటికీ, చాలా మందిని కాపాడలేకపోయారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటన గురించి తెలుసుకుని, మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, సరైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు సూచించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ దుర్ఘటన రోడ్డు భద్రతపై మరోసారి ఆలోచించేలా చేస్తోంది. భారీ వర్షాల సమయంలో రోడ్లు జారుడుగా మారడం, వాహనాల అదుపు కోల్పోవడం వంటి సమస్యలు ఇలాంటి విషాదాలకు దారితీస్తున్నాయి. ఈ ఘటన బాధిత కుటుంబాలకు మాత్రమే కాక, అనేక మందికి ఒక హెచ్చరికలా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/up-39-203373.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.