జూనియర్ ఫ్లెక్సీల తొలగింపు.. అసలు కారణం తెలుసా?

Publish Date:Jan 19, 2024

Advertisement

నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయని గురువారం నుండి పలు డిజిటల్ మీడియా సైట్లు, కొన్ని యూట్యూబ్ చానెళ్లు, ఓ రెండు మూడు మెయిన్ స్ట్రీమ్ చానెళ్లు కూడా రచ్చ రచ్చ చేస్తున్నాయి. అది కూడా బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య సఖ్యత లేదని, బావ చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ కోసం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఎదగనీయకుండా ఏం చేయాలో అన్నీ చేస్తున్నారంటూ ఏవేవో పిచ్చి రాతలు రాసుకొస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లయితే ఎవరో దిక్కూ ముక్కూ లేని అనామకులతో విశ్లేషణలు జరిపించి మరీ వారి చేత పిచ్చి కూతలు కూయిస్తున్నారు. ఇన్నాళ్లూ లోలోపల జరుగుతున్న ఫైట్ ఇప్పుడు బహిర్గతమైపోయిందని రెండు మెయిన్ స్ట్రీమ్ న్యూస్ చానెళ్లు గురువారం మధ్యాహ్నం నుండి పదేపదే ఇదే విషయంపై నానా రచ్చ చేస్తున్నాయి. దీనంతటికీ కారణం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన ఫ్లెక్సీల రగడ. జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఇక్కడ వెలసిన ఫ్లెక్సీలను బాలకృష్ణ తీసేయమని ఆదేశించడం, బాలకృష్ణ అక్కడకి వెళ్ళగానే ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం హాట్ టాపిక్ అయింది.

దివంగత మహానేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌  ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు నేతలు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్‌ ఘాట్ వద్దకు వచ్చిన బాలకృష్ణ  అక్కడ ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను చూసి వాటిని అక్కడ నుండి తీయించేయమని ఆదేశించారు. అంతే పదే పది నిమిషాలలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సీలను అక్కడ నుంచి తీయించేశారు. దీంతో వైసీపీ డిజిటల్ మీడియా గురువారం నుండి పండగ చేసుకుంటున్నది. ఎన్టీఆర్ కుటుంబంలో గొడవలు బహిర్గతం అయ్యాయని, టీడీపీ అధినేత చంద్రబాబు బాబాయ్ అబ్బాయి మధ్య చిచ్చు పెట్టారని, లోకేష్ కోసం ఎన్టీఆర్ ను ఎదగనీయడం లేదని ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నది. ఇంకా చెప్పాలంటే బాలయ్య ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని ఆదేశించడం వైసీపీకి   కోతికి కొబ్బరి చిప్పలాగా దొరికింది.

నిజానికి బాలకృష్ణ స్పందించే తీరుపై ఎవరూ  ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయరు. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వాటిని బాబాయ్ బాలయ్య తీయించేయడాన్ని స్వాగతిస్తారు.   అయితే  వైసీపీ అనుకూల మీడియా, వైసీసీ సోషల్ మీడియా పేజీలు రచ్చ చేస్తున్నట్లుగా ఇది ఎన్టీఆర్ కుటుంబంలో విబేధాలతో చేసిందో.. లోకేష్ కోసం చేసిందో కానే కాదు. ఇంకా వివరంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ మంచి కోసమే బాలకృష్ణ ఈ పని చేశారు.  అబ్బాయి మంచి కోరే బాబాయ్ బాలయ్య ఎంతో బాధ్యతతో ఈ ఫ్లెక్సీలను తీయించేశారు. అక్కడ జరిగేది శుభకార్యమో, జాతరో కాదు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవ్యం, అభిమాన నాయకుడు నందమూరి తారకరామారావు వర్ధంతి. ఎన్టీఆర్ కుటుంబం అక్కడకి వెళ్ళింది ఆ మహనీయుడికి నివాళులు   ఆ పెద్దాయనను గుర్తు చేసుకొనేందుకు వెళ్లారు. అలాంటి చోట ఘనస్వాగతం అంటూ ఫ్లెక్సీలు పెట్టడం ఎంత మాత్రం సముచితం కాదు. బాధాతప్త హృదయంతో అక్కడకి వచ్చే వారికి స్వాగతాలు చెప్పడం ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే బాలయ్య ఆ  ఫ్లెక్సీలను తొలగించారు.

ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వివాదానికి కారణమైన ఎన్టీఆర్ అభిమాని గతంలో కూడా ఇలాగే  ఎన్టీఆర్ వర్ధంతికి భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో అప్పుడు కూడా వాటిని తొలగించారు. ఇలాంటి కార్యక్రమంలో ఇలాంటి పనులు వద్దని కూడా చెప్పారు. కానీ మళ్ళీ అదే పని చేశారు. దీంతో బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. దీనినే వైసీపీ గోరంతను చేసి చూపి.. ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు అంటూ రచ్చ చేయడానికి ప్రయత్నించింది. నిజానికి ఎన్టీఆర్ పై బాలయ్యకి ఉన్నది పుత్ర వాత్సల్యం. మరణించిన వారికి నివాళులు అర్పించేందుకు వచ్చిన వారికి స్వాగతాలు చెప్పడం శుభకరం కాదు. శుభప్రదం కాదు. అలాగే అలాంటి చోట ఫోటోలతో ఫ్లెక్సీలు అసలు మంగళకరం కానే కాదు. గతంలో చెప్పినా మళ్ళీ అదే పని చేశారంటే అది ఖచ్చితంగా కుటుంబం మధ్య చిచ్చు పెట్టేందుకేనని అనుమానించాల్సి వస్తున్నది. ఈ ఫ్లెక్సీల రచ్చ వెనక ఇన్ని కారణాలు ఉన్నాయి కనుకే తండ్రికి నివాళులు అర్పించేందుకు వచ్చిన బాలయ్య  తన కుమారుడి పేరిట స్వాగతాలు కనిపించడం భావ్యంగా భావించలేదు. తండ్రి హరికృష్ణ తర్వాత బాబాయి బాలకృష్ణ తన బాధ్యతను సక్రమంగానే నిర్వర్తించారు. ఎన్టీఆర్ సోదరి సుహాసిని పక్కనే ఉండగానే బాలకృష్ణ ఈ ఫ్లెక్సీలను తొలగించమన్నారంటే ఇది వివాదం కాదు బాధ్యతని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ఏ సాకు దొరుకుతుందా బాలయ్యను, తెలుగుదేశం పార్టీనీ ఇరుకున పెడదామని చూసే వైసీపీకి తప్ప.

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.