ఈ ఆలయాల్లో ఇక అపరిమిత అన్న ప్రసాద పంపిణీ!
Publish Date:May 8, 2025
.webp)
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 16 ప్రముఖ దేవాలయాలలో అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. సెక్రటేరియట్లో దేవాదాయ శాఖపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం విజయవాడలోని కనకదుర్గా దేవాలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం వంటి దేవాలయాలలో మాత్రమే ఈ పథకం అమలులో ఉంది. ఇప్పుడు మరో 16 దేవాలయాలలో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ నిర్ణయం మేరకు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యభగవానుడి ఆలయం, విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం, కాకినాడ జిల్లా తుని పమీపంలోని తలుపులమ్మ అమ్మవారి ఆలయాలలో నిరంతర అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టనున్నారు. అలాగే కోనసీమ జిల్లాలో వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుప తమ్మ అమ్మవారి ఆల యం, కృష్ణాజిల్లా మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం, గుంటూరు జిల్లా పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయాల్లోనూ, నెల్లూరు జిల్లా పెంచలకోన లక్ష్మీనరసిం హస్వామి, మాలకొండ మా ల్యాద్రి లక్ష్మీనరసిం హస్వామి, కర్నూలు జిల్లా ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయాలలోనూ కూడా అపరిమిత అన్న ప్రసాద పంపిణీ జరగనుంది. నంద్యాల జిల్లా మహానందీశ్వరస్వామి, రంగాపురం మద్దిలేటి నరసింహస్వామి ఆలయాల్లోనూ, అలాగే అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనే యస్వామి, శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఖాద్రి లక్ష్మీనర సింహస్వామి, చిత్తూరు జిల్లాలో బోయకొండ గంగమ్మ ఆలయాలలో కూడా అపరిమిత అన్నదాన వితరణ కార్యక్రమాన్ని అములు చేయనున్నారు.
http://www.teluguone.com/news/content/unlimited-annaprasadam-in-these-temples-25-197671.html












