విపక్షాల ఐక్యత ఎండమావేనా?

Publish Date:Dec 19, 2022

Advertisement

2024 సార్వత్రిక ఎన్నికలలో అధికారం కోసం అర్రులు చాస్తున్న బీజేపీ యేతర పార్టీల జాబితాలోకి తాజాగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చేరింది. ఇప్పటికే  కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్ లు ఆ ప్రయత్నాలలోనే ఉన్నాయి. అయితే ఈ పార్టీలన్నిటికీ ఒంటరిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొనడం అంత తేలిక కాదని స్పష్టంగా తెలుసు. అందుకే కూటముల ఏర్పాటు విషయంలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే స్వరాష్ట్రంలో రాజకీయ అవసరాల దృష్ట్యా.. కూటమిలో కీలక పొజిషన్, సముచిత ప్రాధాన్యత విషయంలో ఏకాభి ప్రాయానికి రాలేక చర్చల ప్రక్రియను సుదీర్ఘంగా విడతల వారీగా కొనసాగిస్తూ వార్తలలో ఉండేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే స్థాయికి పరిమితమైపోయాయి. 

వచ్చే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో పాలక బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సంఘటితం  అయి తీరాలన్నది.. బేజేపీయేతర శక్తులన్నీ అంగీకరిస్తాయి. అయితే అందుకోసం వేసే లేదా వేస్తున్న అడుగులే.. బావిలో కప్పల చందంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి.  ప్రస్తుతం దేశంలో ఇటువంటి చర్చే విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కారణంగా ఈ చర్ బలంగా తెరమీదకు వచ్చింది. సాదారణంగా ఇలాంటి చర్చలలో మేధావులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం సహజం. ఇప్పుడూ అదే జరుగుతోంది. అయితే విశేషమేమిటంటే.. ఆ భిన్నాభిప్రాయాలలో కూడా విపక్షాల ఐక్యతపై సందేహాల విషయంలో అనుమానాల విషయంలో ఏకాభిప్రాయమే వ్యక్తంఅవుతోంది.

 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షాలు  ఏకతాటి మీదకు వచ్చి, సంఘటితంగా బీజేపీపై పోరాటం జరిపే అవకాశం ఉందంటూ   జాతీయ దినపత్రిక ఇటీవల ఒక విశ్లేషణను ప్రచురించింది.  నిజానికి, ఏ దినపత్రికా ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత విషయంపై పెద్దగా దృష్టి  సారించడం  లేదు. అయితే తాజాగా ఓ జాతీయ దినపత్రిక  విపక్షాల ఐక్యతపై ఓ కథనం ప్రచురించడమే కాకుండా.. ఆ ఐక్య కూటమికి లేదా ఫ్రంట్ కు  నతీష్ కుమార్ ఔను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమారే  నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషించింది. అయితే ఈ విశ్లేషణను నితీష్ కుమార్ వెంటనే ఖండించారు. విపక్షాల ఐక్యతా ప్రయత్నాలను ఖండించకుండానే.. తాను ప్రధాని రేసులో లేనని స్పష్టం చేశారు.  ఇంత వరకూ బానే ఉంది.  ప్రతిపక్షాల   ఐక్యత కోసం నడుంబిగించి ముందుకు వచ్చే నాయకుడు ఎవరు?  గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చిన ప్రతి సారీ వామపక్షాలు ముందుకు వచ్చేవి. ముఖ్యంగా సీపీఎం నాయకులు తమంత తాముగా చొరవ తీసుకునే వారు. 1996, 2004 సంవత్సరాల మధ్య లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు ఎవరికి వారుగా ఉన్నప్పుడు కూడా సీపీఎం చొరవ తీసుకుని  ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తీసుకు రాగలిగింది.

ఇక జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ పొత్తుల ఎత్తులలో ముందు చూపు ఉన్న నేత అనడంలో సందేహం లేదు.  ఆయన దాదాపుగా ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకునే రంగంలోకి దిగుతారు. ఆ పొత్తుల ఎత్తులతోనే ఆయన గత 15 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. తాజా పరిస్థితి తీసుకుంటే..  ఇటీవల వరకు బీజేపీతో కలిసి సాగిన నితీశ్‌ కుమార్‌  ఇప్పుడు అదే బీజేపీని బద్ధ శత్రువుగా పరిగణిస్తున్నారు.   ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో బీజేపీని గద్దె దింపేందుకు  ప్రతిపక్షాల మధ్య ఐక్యత అంటున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీ కొనాలంటే పొత్తుల  విషయంలో దూరదృష్టి మాత్రమే ఉంటే సరిపోదు.

గతానికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలుచేపట్టిన తరువాత  భారత ఎన్నికల ముఖచిత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మార్పు వచ్చింది. ప్రజలు పార్టీలు ఏవైనా సరా, కూటములు ఏవైనా సరే.. ముందు ఆయా పార్టీల, కూటముల ప్రధాని అభ్యర్థి ఎవరన్నది చూస్తున్నారు. అంటే విపక్షాల ఐక్యత సాకారం కావడమంటే.. అవి ఎన్నకలకు ముందే ప్రధాని అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చి ఆవిషయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. అప్పుడే జనం ఆ కూటమిని కన్సడర్ చేసే పరిస్థితి ఉంటుంది.   అందుకే 2004 వరకూ ఒక లెక్క.. 2004 తరువాత నుంచీ మరో లెక్క అన్నట్లుగా జాతీయ రాజకీయాలు మారిపోయాయి.   ఈ మార్పును పరిగణనలోనికి తీసుకుంటేనే విపక్షాల ఐక్యత సాకారమవుతుంది. లేదంటే ఐక్యతా ప్రయత్నాల దారి గతుకుల బాటగానే మిగిలిపోతుంది. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.