వైసీపీని బంగాళాఖాతంలో కలిపేద్దాం.. చంద్ర నిప్పులు

Publish Date:Oct 19, 2022

Advertisement

జగన్ భయపడి 2024లో గాని, ముందు ఎన్నికలు జరిపినా, వైసిపిని ప్రజలను భూస్థాపితం చేస్తా రు, మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాళ్లు వేస్తున్నాడు. తెలంగాణ మీటర్లు పెట్టడం లేదు. ఎక్కడా లేని ఈ అతితెలివి నీకే ఎందుకు వచ్చింది జగన్, ఈ అతి తెలివి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా రాష్ట్రం లో ఒక్కరికి ఉద్యోగం రాలేదు. నా జీవితంలో దాపరికం లేదు, అందుకే అన్ స్టాపబుల్ లో అన్ని వివరిం చాను,  రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేవరకు విశ్రమించనన్నారు. జగన్ పాలనలో బిసిలు, ఎస్సిలు, ముస్లింలు సహా అందరూ దెబ్బతిన్నారు. ప్రజల అప్పులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు అప్పులు పెంచే ప్రభుత్వం మనకు అవసరమా రాష్ట్రాన్ని కాపాడుకుందాం...అందరూ సహక రించాలని కోరుతున్నా న‌న్నారు.

అస‌త్యాలు చెప్ప‌డంలో జ‌గ‌న్ దిట్ట‌, రైతుల‌ను ఆదుకోవాల‌న్న ఆలోచ‌న ఆయ‌న‌కు లేనే లేద‌ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయ‌కుడు ఎద్దేవా చేశారు. ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నాదెండ్ల గ్రామంలో ప్ర‌తిపంట రైతుల‌ను బాబు క‌లిసి వారి క‌ష్టాలు విన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, భారీ వర్షాలకు ప్రత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. పల్నాడు జిల్లాలో2.52 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 1.50 లక్షల ఎకరాల్లో మిరప పంటల సాగు ఉంది. మిరప, ప్రత్తి పంటలకు ఇప్పటికే ఎకరా నికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టారు.తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ముఖ్యమంత్రికి ఈ పంట నష్టం పట్టడం లేదా అన్నారు. రైతాంగానికి అంత ఇచ్చాం,ఇంత ఇచ్చాం అంటూ ప్ర‌చారం చేసుకోవ‌డ‌మే త‌ప్ప వాస్త‌వానికి రైతుల‌ను ఆదుకోవ‌డానికి జ‌గ‌న్ ఏమీ చేయ‌లేద‌ న్నారు. రైతుల‌కు ఇంత న‌ష్టం జ‌రిగితే అధికారులుగాని, ఎమ్మెల్యేగానీ రాలేద‌ని, రైతుల‌కు మేలు చేసే సీఎం రావాల‌న్నారు. అస‌లు రైతుల‌కు ఏమి ఇచ్చారో ప్ర‌తిగ్రామంలో బోర్డు పెట్టాల‌ని రైతుల‌కు క‌ట్టాల్సిన పంట‌ల భీమా డ‌బ్బులు కూడా క‌ట్ట‌ని ప్ర‌భుత్వం ఇది అంటూ బాబు మండి ప‌డ్డారు. 
 
జ‌గ‌న్ ఎక్క‌డ కాలుపెడితే అక్క‌డ మ‌టాష్‌, ఆయ‌న సీఎం అయిన త‌ర్వాత గుంటూరు జిల్లాలో ఆత్మ‌హ‌త్య లు పెరిగాయ‌ని, ఆయ‌న పాల‌న‌లో మూడువేల‌మంది రైతులు ఆత్మ‌హత్య చేసుకున్నార‌ని, ఈ విష‌యం లో మాత్రం రాష్ట్రం మూడో స్థానంలో ఉంద‌ని బాబు అన్నారు. దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రైతులు మన రాష్ట్ర రైతులే. రైతులపై తలసరి అప్పు 2.45 లక్షలు గా ఉందన్నారు. 

మన మీద కేసులు పెడితే ఏమవుతుంది. పవన్ కళ్యాన్ పార్టీ వారి పైనా కేసులు పెట్టారు. అందుకే నేను వెళ్లి సంఘీభావం తెలియజేశాను. మాపై కేసులు పెట్టడంపై పెట్టే శ్రద్ద రైతులను ఆదుకోవడంపై పెట్టాలి గత ఏడాది మిర్చికి తామర పురుగువచ్చి పంట పోతే ఒక్కరైనా వచ్చి చూశారా, జగన్ రెడ్డి పాలన వల్ల రైతులు అంతా నాశనం అయ్యారన్నారు. 

భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరా పత్తికి 30 వేలు, ప్రతి ఎకరా మిరపకు 50 వేల పరిహారం ఇవ్వాలి. మైక్రో ఇరిగేషన్ ద్వారా 90శాతం సబ్సిడీ ఇచ్చిన ఘనత టిడిపి దే. టిడిపి హయాంలో 60 వేల కోట్లు ఇరి గేషన్ పై ఖర్చు పెడితే, ఇప్పుడు పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. జగన్ ఎక్కడ నుంచి వచ్చాడని, రైతు కుటుంబం నుంచి రాలేదా,  అమరావతి రైతులను హేళన చేస్తా రా....కార్లు, బంగారం అని హేళన చేస్తారా అని చంద్ర‌బాబు ఆగ్ర‌హించారు. 

పవన్ కళ్యాణ్ విశాఖ పట్నం వెళ్లే హక్కులేదా అని ప్ర‌శ్నించారు. మీ దోపిడీ, కబ్జాలు బయటపడ తాయనే  పవన్ను అడ్డుకున్నారా అని బాబు ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి సైకో అనుకుం టే...ఆయన కొత్త సైకోలను తయారు చేస్తున్నారని, అమరావతి కి వెళ్లేటప్పుడు నా కాన్వాయ్ పై దాడి చేస్తే ప్రజాస్వామ్యం అనడం దారుణ‌మ‌న్నారు. పవన్ రాజకీయ పార్టీ వేరే కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం కోసం వెళ్లి తాను మద్ద తు ఇచ్చాన‌న్నారు.రాజకీయ పార్టీలకే దిక్కులేకపోతే, ఇక ప్రజల సంగతి ఏంటని, త‌ప్పుడు ఆరోపణ లకు సిఎం సమాధానం చెప్పాల‌న్నారు.

టిడిపి కార్యాలయంపై దాడి చేసి ఏడాది దాటినా ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి  చర్యలు లేవు, దీనికి  డిజిపి సమాధానం చెప్పగలరా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు, దాడు లకు తాను భయపడనన్నారు. వివేకా హత్య జరిగితే నారా సుర రక్త చరిత్ర అన్నారు. నాడు వివేకా హత్యపై జగన్ సిబిఐ దర్యాప్తు కావాలి అన్నారు...తరువాత సిఎం అయ్యాక సిబిఐ దర్యాప్తు వద్దు అన్నారు. కన్న కూతురుగా తండ్రి హత్యపై పోరాడుతున్న సునీతను అభినందించాలని, సిబిఐ దర్యా ప్తు చేస్తుంటే వారిపైనే కేసులు పెట్ట‌డం ఎక్క‌డ‌యినా ఉంటుందా అని బాబు ప్ర‌శ్నించారు. 

By
en-us Political News

  
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.