తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్
Publish Date:Jul 9, 2025
Advertisement
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తెలంగాణ అవసరాల మేరకు కేంద్ర మంత్రి నడ్డా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యూరియాను బ్లాక్ మార్కెట్ కాకుండా, అన్ని జిల్లాలకు యూరియా పంపిణీ చేసేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆ సమస్య గురించి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి వివరించారు. సీఎం రేవంత్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న నడ్డా బుధవారం అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇటీవల రెండ్రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించారు. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని ఎరువులు, మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, వరంగల్ ఎయిర్‌ఫోర్ట్ ఆర్థిక సాయం, హైదరాబాద్-విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, హైదరాబాద్-బెంగళూరు మధ్య తలపెట్టిన పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్ కారిడార్‌గా అభివృద్ధి చేయడంపై చర్చించారు.
http://www.teluguone.com/news/content/union-minister-nadda-39-201633.html





