నేడు సిట్ ఎదుటకు కేంద్ర మంత్రి బండి సంజయ్

Publish Date:Aug 7, 2025

Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం (ఆగస్టు 8)  ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ ఎదుట హాజరు కానున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులనే కాకుండా, బాధితులను కూడా విచారించి వారి వాంగ్మూలం కూడా తీసుకుంటున్న సిట్ అందులో భాగంగానే బండి సంజయ్ కూ నోటీసులు పంపింది.

ఆ నోటీసుల మేరకు  వాంగ్మూలం ఇవ్వడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం (ఆగస్టు 8) సిట్ ఎదుట హాజరుకానున్నారు.   బీఆర్ఎస్ హయాంలో  తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పటికే బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందుకు సంబంధించిన ఆధారాలను ఆయన సీట్ అధికారులకు అందజేసే అవకాశం ఉంది.

ఇక పోతే.. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిందని చెప్పబడుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తున్నది. ఇందు కోసం కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం నాడు వీరు కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, సిట్ అధికారులతో భేటీ  అయ్యారు. 

By
en-us Political News

  
త‌న‌ను ట్రోల్ చేస్తున్నార‌నీ.. వారంద‌రికీ చెప్పేదేంటంటే ఇది జ‌స్ట్ ట్రైల‌ర్ మాత్ర‌మే. ముందుంది అస‌లు సినిమా అంటూ వార్నింగ్ ఇచ్చారు క‌విత‌.
పయ్యావుల బడ్జెట్ ప్రసంగం మొత్తం ఆత్మస్థుతి, పరనిందేనని విమర్శించారు. అంకెల గారడీ తప్ప ఏ మాత్రం పసలేని బడ్జెట్ అంటూ బడ్జెట్ ప్రసంగంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పేర్లను పదిసార్లు ప్రస్తావించడం తప్ప ప్రజలకు మేలు చేసే అంశాలు లేవని విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ మద్యం కుంభకోణం విషయంలో విజయసాయిరెడ్డి సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇక ఇటీవలి కాలంలో ఆయన ట్వీట్లు, కామెంట్లు అన్నీ కూడా ఆయన కషాయ దళంలో చేరనున్నారన్న ప్రచారానికి కారణమయ్యాయి. తాజాగా విజయసాయి రెడ్డి ఆ ప్రచారంలో ఇసుమంతైనా అవాస్తవం లేదనిపించేలా సామాజిక మాధ్యమం వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత ముఖ్యమో, నేతలతో ఆత్మీయ పలకరింపు కూడా అంతే ముఖ్యమన్న లోకేష్ అంతటితో ఆగకుండా.. ఏఐ క్వాంటం ఎంత అవసరమో మనవీయ సంబంధాలూ అంతే అవసరమని చెప్పారు. కుటుంబాలతో బంధం బలోపేతం కోసమే డిన్నర్ సమావేశాలని చెప్పారు.
ఇప్పటి వరకు సాధించిన .. ఇంకా ఏం సాధించాల్సిన అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పిన విత్త మంత్రి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
రూ.3,32,205 కోట్లతో పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా వేశారు. ఇక రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు. ద్రవ్య లోటు రూ.75,868 కోట్లుగా అంచనా వేశారు.
ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోట అనుకున్న ప్రాంతాలలో కూడా మునిసిపోల్స్ లో బీఆర్ఎస్ చతికిల పడటం చూస్తుంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. కరీంనగర్, నిజామాబాద్ వరంగల్ లలో ఆదరణ లేకుండా పోయింది. ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.
మెదక్ జిల్లాలో  మెదక్, నర్సాపూర్ మునిసిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. అలాగే,  కరీంనగర్ జిల్లాలో వేములవాడ, మెట్ పల్లి, రాయికల్ , కోరుట్ల, జమ్మికుంట మునిసిపాలిటీలలో హంగ్ ఏర్పడింది.
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ విజయంపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ విజయం లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమకు దక్కిన ఫలితంగా అభివర్ణించారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్ కిడ్నాప్ అయ్యారన్న వార్తలు వెలువడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్ ను కాంగ్రెస్ కిడ్నాప్ చేసిందని బీఆఱ్ఎస్ ఆరోపిస్తున్నది. 32వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన గుగులోతు రాంబాబు కిడ్నాప్ నకు గురయ్యారనీ, కాంగ్రెస్ నాయకులే రాంబాబును బలవంతంగా తీసుకెళ్లారని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆరోపించారు.
మునుగోడు మీరు చూసుకోండి… తెలంగాణ నేను చూసుకుంటా అంటూ ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తనకు అడుక్కోవడం రాదన్న ఆయన.. పార్టీ తనకు ఇచ్చిన మాటకు కట్టుబడి మర్యాదగా మంత్రి పదవి డిమాండ్ చేశారు. అలా ఇవ్వకుంటే లాక్కునే స్థాయికి వెడతానని హెచ్చరించారు.
పోటీలు పడి మరీ ఓట్ల కోసం డబ్బులు పంచుకుంటూ పోతే ఏపీ దివాళా తీస్తుందని హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలు అంటూ కేటాయింపులు చేయడం వల్ల బడ్జెట్ మొత్తం సంక్షేమ పథకాలకే సరిపోతోందన్న పీవీ రమేష్ దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించారు.
పయ్యావుల బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇక సభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. ఇక మండలిలో బడ్జెట్ ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ బడ్జెట్ ను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశ పెడతారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.