Publish Date:Jan 29, 2026
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, అందుకు రాష్ట్రంలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలలో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.
ఈ నేపథ్యంలోనే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి జాతీయ స్థాయి నాయకులను రంగంలోనికి దింపుతున్నది. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా తో పాటు పార్టీ జాతీయ స్థాయి నాయకులు కూడా రానున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు.రాష్ట్రంలో మునిసిపల్ ప్రచారంలో భాగంగా మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వివరించారు.
ఇక తెలంగాణ ముఖ్మంయత్రి రేవంత్ కూడా మునిసిపల్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 3న మిర్యాలగూడ, 4న జగిత్యాల, 5నచేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో సీఎం పర్యటించి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉండగా, మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు గురువారం (జనవరి 28) 890 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/union-home-minister-to-campaign-in-telangana-municipal-elections-25-213174.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.