శ్రీనగర్ కొత్త ఎయిర్ పోర్టు టెర్మినల్‌కు కేబినెట్ ఆమోదం
Publish Date:Feb 24, 2026
Advertisement
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పేరు మార్పుపై కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ఇప్పటికే కేరళ అసెంబ్లీలో పలుమార్లు తీర్మానాలు చేసింది. ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలోని ఫస్ట్ షెడ్యూల్‌లోనూ కేరళను కేరళంగా మార్చేలా సవరణలు చేపట్టాలని విజయ్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. తాజాగా దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. మరోవైపు గోండియా-జబల్ పూర్ రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీనగర్‌లో కొత్త ఎయిర్ పోర్టు టెర్మినల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్ మెట్రో విస్తరణకు పచ్చజెండా ఊపింది. ఇంధన రంగంలో సంస్కరణలు చేపట్టాలని నిర్ణయంచారు. ముడి జనపనారకు కనీస మద్దతు ధరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా ప్రారంభించిన ప్రధానమంత్రి కార్యాలయ భవనం 'సేవా తీర్థ్' లో జరిగిన తొలి కేబినెట్ సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. సేవా తీర్థ్‌లో జరిగిన ఈ తొలి సమావేశంతో, ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం 140 కోట్ల మంది దేశవాసులకు సేవ చేసే స్ఫూర్తితోనే ఉంటుందని, దేశ నిర్మాణ విస్తృత లక్ష్యంతో ముడిపడి ఉంటుందని కేంద్ర కేబినెట్ తెలిపినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
http://www.teluguone.com/news/content/union-cabinet-meeting-36-214603.html





