ప్రతిపక్ష హోదా కోసం జగన్ వృధా ప్రయాస
Publish Date:Nov 4, 2025
Advertisement
ప్రజలు ఇవ్వకపోయినా విపక్ష హోదా కోసం నానాయాగీ చేస్తూ, మంకుపట్టుపట్టి ప్రజల దృష్టిలో మరింత చులకల అవుతున్న జగన్ మోహన్ రెడ్డికి ఆయన చేస్తున్నదంతా వృధాప్రయాసేనని తెలియదా? వైసీపీ లో అంతో కొంతా విషయజ్ణానం ఉన్న వారు ఎవరూ ఈ సంగతిని ఆయనకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేవలం అహంభావంతో ఆయన విపక్ష హోదా కోసం పట్టుబడుతున్నారనీ, ఏం చేసినా ఆయనకు విపక్ష నేత హోదా కానీ, ఆయన పార్టీకి విపక్ష పార్టీ హోదా కానీ వచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవనీ పరిశీలకులు అంటున్నారు. అయితే తాజాగా జగన్ కు అత్యంత బలమైన మద్దతు దారు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విపక్ష హోదా కోసం జగన్ పడుతున్న తాపత్రేయం అనవసరమని అన్నారు. ఎంత పాకులాడినా ఆయనకు విపక్ష నేత హోదా వచ్చు అవకాశం లేదనీ, ఆ విషయంలో జగన్ చేస్తున్నదంతా వృధా ప్రయాసేనని కుండబద్దలు కొట్టేశారు. రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదని ఉండవల్లి విస్పష్టంగా చెప్పారు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని ఉండవల్లి అన్నారు. ఈ విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకు రాజకీయంగా అంత మేలు జరుగుతుందని అంటున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కనుకే తాను అసెంబ్లీకి రావడం లేదని జగన్ అంటున్నా.. ఉండవల్లి చెబుతున్నదాన్ని బట్టి చూస్తే సీఎంగా చక్రం తిప్పిన అసెంబ్లీలో ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోవడానికి జగన్ కు అహం అడ్డొస్తోందనీ, ఆ కారణంగానే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారన్నది ఉండవల్లి అభిప్రాయంగా కనబడుతోంది. అధికార తెలుగుదేశం కూటమి కూడా జగన్ కేవలం అహంభావంతో మాత్రమే అసెంబ్లీని బాయ్ కాట్ చేశారని విమర్శిస్తున్నారు. ఇప్పడుు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అధికారపార్టీ అంటున్నదే రైట్ అన్నారని భావించాల్సి వస్తున్నది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం విడ్డూరంగా ఉందంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. అధికార పక్ష సభ్యుల తీరు నచ్చకుంటే సభ నుంచి వాకౌట్ చేయడం వంటివి సాధారణమని, కానీ మొత్తంగా సభకే గైర్హాజరు కావడం అనుచితమని, ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదనీ అన్నారు. మరి ఇప్పటికైనా జగన్ కు జ్ణానోదయం అవుతుందా చూడాల్సిందే!
జగన్ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో తమ పార్టీకి ఉన్న 151 మంది సభ్యుల బలం చూసుకునిసభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అందరినీ అవమానించిన జగన్ ఇప్పుడు తనకు అదే మర్యాద జరుగుతుందన్న భయంతోనే ప్రతిపక్ష హోదా నెపంతో సభకు గైర్హాజరు అవుతున్నారని అధికార పార్టీ అంటున్నది.
http://www.teluguone.com/news/content/undavally-say-jagan-effort-for-opposition-status-wast-45-208998.html





