Publish Date:Sep 19, 2020
ఏపీ రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని ఒక దాని తరువాత ఒకటి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఒక వైసిపి కార్యకర్త వద్ద ఎన్నికల సమయంలో 1.40 కోట్లు తీసుకుని అందులో కొంత మాత్రమే చెల్లించగా మిగిలిన 80 లక్షలు తిరిగి చెల్లించమంటే అతడిని బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయి. అంతకుముందు పేకాట క్లబ్ నిర్వహణలో ఎమ్మెల్యే హస్తముందని విమర్శలు వచ్చాయి. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక పోలీస్ అధికారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే శ్రీదేవి పేరుతో తాజాగా ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సీఐని నోటికొట్టినట్లు ఆమె దూషించారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని పట్టుకున్నందుకు సీఐకి ముక్క చివాట్లు పెట్టారు. వాళ్లు నా మనషులు.. వదలిపెడతావా? లేదా? అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను కనుక తలుచుకుంటే రెండు నిమిషాల్లోనే వెళ్లిపోతావ్ అంటూ ఆ సిఐ పై ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ ఆడియో క్లిప్‌పై తీవ్ర దుమారం రేగుతోంది.
ఆ ఫోన్ సంభాషణలో ఏముందంటే..
హలో.. నీకు ఎప్పటి నుంచి చెప్తున్నా? వాళ్లను పంపేయొచ్చుగా.. నీకేమైనా మెంటలా? ఆ రోజు పట్టుకున్నప్పుడే నేను నీకు ఫోన్ చేశానా? లేదా? ఏం మాట్లాడుతున్నావ్. నేనంటే రెస్పెక్ట్ లేదా? అందరినీ వదిలిపెడతావ్. మా వాళ్లను మాత్రం వదలిపెట్టవా..? నాన్సెన్స్.. అసలు నీవు పంపిస్తావా? లేదా చెప్పు. నువ్వు నా కాళ్లు పట్టుకుని ఇక్కడికి పోస్టింగ్ తెచ్చుకున్నావ్. నేను చెప్పింది చేస్తానని ఆ రోజు చెప్పావు. ఇప్పుడు ఎమ్మెల్యేనని కూడా చూడకుండా కార్యకర్తలా బిహేవ్ చేస్తున్నావ్. నేను తలచుకుంటే రెండు నిమిషాల్లో ఇక్కడి నుండి వెళ్లిపోతావ్.. ఎక్స్ ట్రాలు చేయొద్దు.. మావాళ్లను వదిలిపెట్టు. లేదంటే ఎస్పీకి, డీజీపీకి చెబుతా.. అని ఆ వైరల్ ఆడియో క్లిప్‌లో ఉంది.
అయితే దీనికి సమాధానంగా సీఐ మాట్లాడుతూ అక్రమంగా మట్టి, ఇసుక తరలించడానికి వీల్లేదని చెబుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది. అక్రమ మట్టి, ఇసుక తరలింపుపై ఉక్కుపాదం మోపడం రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అని, అంతేకాకుండా ఇలా చేస్తే మీకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఆయన ఎమ్మెల్యేకు నచ్చచెప్పే ప్రయత్నం చేసారు. దీంతో నా మాటంటే నీకు లెక్కలేదా అని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నట్లుగా ఆ ఆడియో క్లిప్ లో ఉంది. ఈ ఆడియోపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారులను బెదిరించడమేమంటని ప్రతిపక్షాల నేతలు మండిపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/undavalli-sridevi-audio-clip-viral-in-social-media-25-104215.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.