మాజీ మంత్రి అనిల్ కు బాబాయ్ పోటు

Publish Date:Aug 25, 2022

Advertisement

మొన్నటి దాకా చిన్నా..పెద్దా తేడా లేకుండా అందరిపైనా నోరు పారేసుకున్నారు. అందుకు బహుమతిగా మంత్రి పదవి ఊడింది. తాజా మంత్రి కాకాణిపైనా రెచ్చిపోయారు. సీన్ కట్ చేస్తే.. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలంతా కలిసి తోక కట్ చేసి ఓ మూలన పడేశారు. ఆయనే    మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్   వరుస పరాభవాలతో ఇప్పటికే  తలపట్టుకుంటున్న అనిల్ కు ఇప్పుడు సొంత బాబాయ్ రూపంలో మరో గండం తరుముకొస్తోంది.  2024 ఎన్నికల్లో అనిల్ కు చుక్కలు చూపిస్తానంటున్నారు ఆయన బాబాయ్, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.

నిన్నటి దాకా అనీల్ కుమార్ ను అన్నీ తానై నడిపిన రూప్ కుమార్ ఒక్కసారిగా అబ్బాయ్ అనిల్ పై ఇంతలా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారనే చర్చ ఇటు పార్టీలోనూ, అటు నెల్లూరు జనంలోనూ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందిజరుగుతోంది.   అనిల్ ను చేరదీసి కార్పొరేటర్ ని చేసి, నెల్లూరు నగర ఎమ్మెల్యే టిక్కెట్టు ఇప్పించిన ఆనం కుటుంబాన్నే వెన్నుపొటు పొడిచారు అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కు రూప్ కుమార్ అండ అంతా..ఇంతా కాదు. నెల్లూరులో అనిల్ రాజకీయాలు చేయడానికి ఒక రకంగా రూప్ కుమారే కారణం. నోటి దురుసుతో అందరినీ దూరం చేసుకున్న అనిల్ కు ఇప్పుడు బాబాయ్ రూప్ కుమార్  తలనొప్పిగా మారారు.

అనిల్ ఆఫీసుకు కొద్ది దూరంలో జగనన్న భవన్ అని కొత్త కార్యాలయాన్ని రూప్ కుమార్ ప్రారంభించారు. కార్యకర్తలను భారీగా సమీకరించి అనిల్, తాను విడిపోయామనే సంకేతం పంపారు రూప్ కుమార్. అది జరిగిన రెండు రోజులకే రూప్ కుమార్ వర్గంపై కేసులు బనాయించే ప్రయత్నం చేసేలా పోలీసులను అనిల్ పురమాయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రూప్ కుమార్ పోలీస్ స్టేషనులోనే తిష్టవేసి, తన అనుచరులను విడిపించుకున్నారు. అంతటితో ఆగకుండా అనిల్ ఇది జెస్ట్ ట్రయల్ మాత్రమే.. త్వరలో త్రిబులార్ సినిమా చూపిస్తానని  హెచ్చరించారు. పెద్ద..పెద్ద కుటుంబాలనే ఓ ఆటాడుకున్నా.. అనిల్  ఆఫ్ట్రాల్ నువ్వెంత అంటూ రూప్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. దీంతో నెల్లూరు సిటీలో అనిల్ పరువు కాస్తా గంగలో కలిసిందంటున్నారు.

ఎంత అబ్బాయ్ అయితే మాత్రం.. సిట్టింగ్ ఎమ్మెల్యే.. మాజీమంత్రి అందులోనూ జగన్ వదిలిన ‘బూతు బాణం’.. అనిల్ కుమార్ నే హెచ్చరించడంతో రూప్ కుమార్ వార్తల్లోకెక్కారు. ఇప్పుడు రూప్ కుమార్ వేరుకుంపటి పెట్టడంతో బాబాయ్- అబ్బాయ్ మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది? అసలేం జరిగింది? అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది.

By
en-us Political News

  
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.