మెగాస్టార్ చిరంజీవి, పాపులర్ ప్రవచన కర్త గరికపాటి మధ్య యాధృచ్ఛికంగా జరిగిన చిన్న సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమం వేదికగా రచ్చ రచ్చ అవుతోంది. హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరు విషయంలో గరికపాటి తొందరపాటుతోనో, తన ప్రసంగానికి అవాతరం అవుతోందనో ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అ
యితే వెంటనే నిర్వాహకులు సముదాయించారు. చిరంజీవి సంయమనం పాటించారు. అక్కడితో ఆ వ్యవహారం ముగిసిపోయింది. అయితే చిరంజీవి అభిమానులూ, ఆయన సోదరుడు నాగబాబు సామాజిక మాధ్యమం వేదికగా ఈ అంశాన్ని పెద్దది చేయడానికి చూపుతున్న ఉత్సాహం చిరు గౌరవాన్ని ఇనుమడింప చేసేదిగా లేదు సరికదా.. ఏదో రూపంలో విమర్శలు చేయాలని, బురద జల్లాలనీ ప్రయత్నించే వారికి అవకాశం ఇచ్చేదిలా ఉంది.
ఇప్పటికే నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు బ్రాహ్మణ సంఘాలు స్పందిస్తున్నాయి. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరు వ్యవహరించిన తీరు అహంకారానికి నమూనాగా ఉందనీ, అందుకనే ప్రవచన కర్త గరికపాటి అసహనం వ్యక్తం చేశారనీ వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నాయి. అవును నిజమే అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి – గరికపాటి జరిగిన చిరు ఘటన అవాంఛనీయమే. చిరుని చుట్టిముట్టి ఫొటోలు దిగుతున్న అభిమానుల సందడి అప్పుడే ప్రసంగించడానికి ఉపక్రమిస్తున్న గరికపాటిని ఒకింత అసహనానికి గురి చేసింది. అందుకే మీరు ఫొటో సెషన్ ఆపకపోతే నేను వెళ్లి పోతాను అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. విషయం గ్రహించిన చిరంజీవి వెంటనే అభిమానులను సముదాయించి ఫోటో సెషన్ కు స్వస్తి పలికారు. ఆ తరువాత గరికపాటి, చిరంజీవి పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. జరిగిన సంఘటన వారిరువురిపైనా ఎలాంటి ప్రభావం చూపలేదనడానికి ఇదే నిదర్శనం. ఇరువురూ కూడా వారి వారి రంగాల్లో లబ్ధ ప్రతిష్టులు , నిష్ణాతులు. ఇద్దరిలో ఒకరు పద్మశ్రీ అయితే ఒకరు పద్మభూషణ్. జరిగిన సంఘటన కాకతాళీయమేనని ఇరువురూ గ్రహించారు.
దానిని అక్కడితో ఆపేస్తే బాగుండేది.. కానీ చిరంజీవి సోదరుడు నాగబాబు అత్యుత్సాహంతో ట్విట్టర్ వేదికగా గరికపాటిపై కౌంటర్ వేశాడు. చిరంజీవి ఇమేజ్‌ని చూస్తే ఏపాటి వాడికైనా ఈ పాటి అసూయ కలగడం పరిపాటే అంటూ సెటైర్ వేశారు. అందుకు తందాన పాడుతున్న చందంగా చిరంజీవి అభిమానులు గరికపాటి క్షమాపణలు డిమాండ్ చేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారు. దీంతో గరికపాటికి మద్దతుగా ఆయన అభిమానులు బ్రాహ్మణ సంఘాల పేర రంగంలోకి దిగారు. ఈ తీరు ఇటు చిరంజీవికీ, అటు గరికపాటికీ కూడా గౌరవాన్ని తెచ్చి పెట్టేది కాదు. ఒక ముగిసిన అధ్యాయాన్ని లాగి పీకి రచ్చ చేయడం తగదు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచిదని విజ్ణులు సూచిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/un-necessart-dispute-on-social-media-on-chiru-garikapati-issue-25-145048.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.