బ్రిటన్ లో గ్రూమింగ్ గ్యాంగుల అరాచకాలపై ఆందోళన.!

Publish Date:Aug 20, 2026

Advertisement

బ్రిటన్ లో గ్రూమింగ్ గ్యాంగ్‌ల పేరుతో సాగుతున్న వ్యవస్థీకృత లైంగిక దోపిడీ   తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక బాలికలను లక్ష్యంగా చేసుకుని కొందరు ముఠాలుగా ఏర్పడి  అరాచకాలకు పాల్పడుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్వహించిన విచారణతో పాటు పార్లమెంట్‌లో వెల్లడైన వివరాలు బ్రిటన్ సమాజాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్నీ  దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

ఇటీవల పార్లమెంట్ వేదికగా ఎంపీ లోవె  ఈ ముఠాల అకృత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలతో బయటపడిన పలువురు బాధితుల వాంగ్మూలాలను అధ్యయనం చేసిన అనంతరం ఈ దారుణాలు బయటపడ్డాయన్నారు. ఈ గ్యాంగ్‌లలో పాకిస్థాన్ నుంచి వచ్చిన టాక్సీ డ్రైవర్లు, స్థానిక వ్యాపారులు సభ్యులుగా ఉన్నట్లు తేలింది. వీరు 12 నుంచి 18 ఏళ్ల వయస్సు గల శ్వేతజాతి బాలికలను మభ్యపెట్టి, వారిపై ఘోరాలకు ఒడిగడుతున్నట్లు విచారణలో తేలింది.

 13 ఏళ్ల చిన్నారిపై  దాడి చేయడం, 15 నుంచి 20 మంది బాలికలను కుక్కల బోనుల్లో బంధించి వ్యాన్లలో రవాణా చేయడం వంటి ఘాతకాలు జరిగినట్లు విచారణ తేల్చింది.  ఒక బాధితురాలు తాను 13 ఏళ్ల వయస్సు నుంచి దాదాపు 600 నుండి 700 మంది చేతుల్లో నిరంతరం వేధింపులకు గురయ్యానని విచారణాధికారుల ముందు వెల్లడించింది.  పండుగల సమయాల్లో ఈ తరహా దాడులు  ఎక్కువగా జరుగుతున్నాయని దర్యాప్తులో  వెల్లడైంది.

పోలీసు యంత్రాంగం, అధికార వర్గాల నిర్లక్ష్యం, వ్యవస్థీకృత వైఫల్యాల వల్లే ఈ అరాచకాలు ఇన్నాళ్లూ బయటకు రాలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  బ్రిటన్‌ వ్యాప్తంగా దాదాపు 85   ప్రాంతాల్లో ఈ గ్రూమింగ్ గ్యాంగ్‌ల కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో  అంటే.. 2001లో యార్క్‌షైర్‌లోని రోథర్‌హామ్‌ ప్రాంతంలో ఈ తరహా ఘటనలు మొదటిసారి వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో పాకిస్థానీ సంతతికి చెందిన కొందరు  12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 2010లో శిక్షలు పడ్డాయి. అనంతరం 2014 నివేదికల ప్రకారం సుమారు 1,400 మంది చిన్నారులు ఈ ముఠాల బారిన పడి కిడ్నాప్, అక్రమ రవాణాకు గురైనట్లు తేలింది.  2023లో  దేశవ్యాప్తంగా 1.15 లక్షల మంది పిల్లలపై వేధింపులు జరిగాయనీ, వారిలో  వేల సంఖ్యలో చిన్నారులు ఉన్నారనీ విచారణ బయటపెట్టింది. 

ఈ అరాచకాలను అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వాలు వివిధ దశల్లో చర్యలు చేపట్టాయి. 2023లో అప్పటి ప్రధాని రిషి సునాక్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏడాది వ్యవధిలోనే 550 మంది నిందితులను అరెస్టు చేసింది. ఆ తర్వాత కీర్ స్టార్మర్ ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ స్థాయిలో చట్టబద్ధ విచారణకు ఉత్తర్వులు జారీ చేయగా, హోం శాఖ స్వతంత్ర విచారణకు సైతం ఆదేశించింది.

ఇటీవల ఈ గ్యాంగ్‌ల నాయకుడైన షబ్బీర్ అహ్మద్‌ను పాకిస్థాన్‌కు డిపోర్ట్ చేయాలని బ్రిటన్ భావించినప్పటికీ..  అతడు బ్రిటిష్ పౌరుడేనని చెబుతూ పాకిస్థాన్ తిరస్కరించింది. దాంతో బ్రిటన్ ప్రభుత్వం అతడి పౌరసత్వాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేసింది. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఈ సంక్షోభంపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని చట్టసభ సభ్యులతో పాటు పౌర సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. 

UKGrooming Gangs, Britain Minor Abuse Case, UK Parliament Speech, Child Sexual Exploitation UK, Grooming Gang Investigation

By
en-us Political News

  
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో  దోషిగా  తీహార్ జైళ్లో  శిక్ష అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను జైలు అధికారులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.  
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లుఅలాగే  ఏపీ ఉన్నత విద్య నియంత్రణ,  పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లుకు కూడా శాసనమండలి  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే..  విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు సైతం సభ ఆమోదం పొందింది.
 దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన చంద్రబాబు నొక్కి చెప్పారు.  అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు  ప్రతిపాదించారు.
హర్మూజ్ జలసంధిలోని దక్షిణ మార్గంలో, ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా నియంత్రణలోని ఈ ప్రత్యేక కారిడార్‌..  సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి  ఇంధన ఉత్పత్తి దేశాల నుంచి చమురు నింపుకున్న ట్యాంకర్లతో పాటు, ఖాళీగా తిరిగొచ్చే నౌకలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ రవాణాను సమన్వయం చేస్తున్నది.
ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి,  రేచర్ల బొగ్గు బ్లాకులను ఎంపిక చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఈ రెండు  బొగ్గు బ్లాకులను దక్కించుకుంది.
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల  విదేశీ చెల్లింపుల  వ్యవహారంలో పన్ను ఎగవేత, యు అక్రమ నిధుల మళ్లింపు ఆరోపణలపై ఐటీ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో  13 ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.  ఈ సోదాల్లో డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి ఎల్‌ఐసికి ఆర్బీఐ అనుమతి లభించింది. ఈ వార్తతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర 1% పెరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. కొకైన్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ITIA అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ పూల్ డి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 5 3 తేడాతో సంచలన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగి జట్టుకు ఘన విజయాన్ని అందించిన పూర్తి వివరాలు చూడండి.
బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధు, ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. సాత్విక్ చిరాగ్ జోడీకి వాకోవర్ లభించగా, లక్ష్యసేన్ తీవ్ర పోరాటంలో ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ఫలితాలు, కీలక గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
అంతర్జాతీయ చెస్ రంగాన్ని ఏలుతున్న భారత్! ప్రతిష్టాత్మక సింక్‌ఫీల్డ్ కప్‌లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి అగ్రస్థానానికి చేరుకున్న ఆర్. ప్రజ్ఞానంద. మరోవైపు ఆసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్ 11 బాలికల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు చదవండి.
నాసా ప్రతిష్టాత్మక స్విఫ్ట్ గామా-రే టెలిస్కోప్ రెస్క్యూ మిషన్ విఫలమైంది. $30 మిలియన్ల వ్యయంతో చేపట్టిన రోబోటిక్ క్రాఫ్ట్ నియంత్ పిలవకపోవడంతో మిషన్‌ను నాసా రద్దు చేసింది. త్వరలోనే భూ వాతావరణంలో మండిపోనున్న స్విఫ్ట్ టెలిస్కోప్ పూర్తి వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.