ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్ మంజూరు..!

Publish Date:Aug 4, 2026

Advertisement

 

తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన వ్యాఖ్యల వ్యవహారంలో ప్రతిపక్ష నేత డీఎంకే వర్కింగ్  ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ సినీ నటి త్రిషలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

కావేరీ జలాల పంపిణీకి సంబంధించి తంజావూరులో డీఎంకే నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ పాలనా తీరును విమర్శిస్తున్న సమయంలో, సభలోని కొందరు మద్దతుదారులు నటి త్రిష పేరును నినాదాలుగా చేశారు. ఆ సమయంలో ఉదయనిధి నవ్వుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

సభలో చోటుచేసుకున్న ఈ పరిణామంపై అధికార టీవీకే (తమిళగ వెట్రి కళగం) వర్గాలు మరియు భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉదయనిధి మాట్లాడిన తీరు మహిళలను తీవ్రంగా అవమానించేలా ఉందంటూ తంజావూరు పోలీసు స్టేషన్‌లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులు వివిధ తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మంగళవారం ఉదయం చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వార్త వ్యాపించడంతో ఉదయనిధి నివాసం వద్ద, పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో డీఎంకే కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల చర్యను నిరసిస్తూ డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టాయి.

తాజా అరెస్ట్ చర్యలపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్, ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని మండిపడ్డారు. తాను ఎలాంటి తప్పు మాట్లాడలేదని, ఈ కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. వెంటనే ఆయన తరఫు న్యాయవాదులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి అత్యవసర విచారణ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు, వాదనలు విన్న అనంతరం ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో డీఎంకే వర్గాల్లో ఉత్సాహం నెలకొనగా, పోలీస్ స్టేషన్ వద్ద వాతావరణం శాంతించింది.

అయితే కావేరీ జలాల వివాదంతో పాటు నాయకుల వ్యక్తిగత విమర్శల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ సమరం మున్ముందు తమిళనాడులో మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ  చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు.

Udhayanidhi Stalin Bail, Madras High Court, Trisha Vijay Controversy, Tamil Nadu Politics, DMK Leader Arrest, CM Vijay, MK Stalin

By
en-us Political News

  
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం
లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
నేలతల్లి గర్భంలో కోటానుకోట్ల రూపాయల విలువైన బాక్సైట్ సంపద నిద్రాణమై ఉంది.
కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఏపీ అధికారి..ఇద్దరు మృతి..!
రెండు కాళ్లు విరిగిన రోగిపై లైంగిక వేధింపులు.. !
ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత అజెండాల కోసం వినియోగించడం తగదని హెచ్చరించింది. పిటిషనర్ పేర్కొంటున్న బాధితులు, అభ్యర్థులు నేరుగా కోర్టు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది.
మైనర్ బాలికను బాస్కెట్‌ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది
చూడటానికి ఆకర్షణీయంగా.. చేతిలోకి తీసుకుంటే బరువుగా.. నాణ్యమైన బ్రాండెడ్ మసాలాల్లా కనిపిస్తున్నాయి..
ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిరసన ప్రాంగణంలో లభ్యమైన ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల ఆధారంగా పోలీసులు స్థానిక రెస్టారెంట్లు, కేఫ్ యజమానులను విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.