శివసేన పిట్ట పోరును ఈసీ తీర్చేసినట్లేనా?.. సుప్రీం కోర్టు ఏం చెబుతుంది?

Publish Date:Feb 21, 2023

Advertisement

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్న సామెతగా మహారాష్ట్రలో రెండుగా చీలిన శివసేన విషయంలో ఈసీ రంగంలోకి దిగి తగవు తీర్చింది.  శివసేన పార్టీ పేరును, పార్టీ గుర్తును ఇద్దరికి కాకుండా తాత్కాలికంగా సీజ్ చేసి.. ఆ తరువాత తీరిగ్గా. పిడుక్కి, బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా మెజారిటీ పేరు చెప్పి షిండే  వర్గానికి దఖలు చేస్తూ తీర్పు ఇచ్చేసింది. పిల్లి అలాగే చేస్తుంది. ఏది చేసిన తన యజమానికి లాభం చేకూర్చే విధంగానే చేస్తుంది. అయితే ఆ తీర్పు ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యం కావాలన్న రూలేం లేదు.

సీఈసీ తాను తగవు తీర్చేశానని చేతులు దులిపేసుకున్నా.. తమ ఎన్నికల గుర్తును దొంగిలించారంటూ మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈసీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు గుర్తుల అంశం సుప్రీం కోర్టులో ఉండగా.. షిండే వర్గానికి వాటిని దఖలు చేసేందుకు ఈసీ ఎందుకు తొందరపడిందన్నది ఆయన ప్రశ్న. గతంలో అంధేరి ఈస్ట్- అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సమయంలో కేంద్ర ఏన్నికల సంఘం శివసేన గుర్తును ఇరు పార్టీలకూ చెందకుండా సస్పెండ్ చేసింది. అప్పట్లో ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసినా అప్పటికి అది సరైన నిర్ణయంగానే పరిశీలకులు పేర్కొన్నారు. 

 గత ఏడాది జూన్ లో శివసేన రెండుగా చీలి, షిండే వర్గం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి, ఇటు మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే వర్గం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గం అసలు శివసేన తమదేనని  తమ వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి, పార్టీ గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ వస్తున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కోరిన సమాచారం ఇచ్చేందుకు థాకరే వర్గంఅప్పట్లో పదే పదే గడవు పొడిగింపు కోరడంతో అప్పటికి అంటే అంధేరీ ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమయంలో ఎన్నికల  సంఘం  శివసేన పార్టీ పేరు, పార్టీ ఎన్నికల  చిహ్నాన్ని స్తంబింప చేసింది. అప్పట్లో , కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి షిండే వర్గం స్వాగతించింది.

అయితే, మాజీ ముఖ్యమంత్రి థాకరే వర్గం మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయాని తప్పు పట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అన్యాయమంటూ గగ్గోలు పెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఉన్న స్నేహం కారణంగానే షిండే వర్గానికి అనుకూలంగా ఈసీ నిర్ణయం తీసుకుందని ఆరోపణలు గుప్పించింది.  ఎవరెలా వ్యవహరించినా చివరకు సత్యమే గెలుస్తుందని థాకరే వర్గం అప్పట్లో విశ్వాసం వ్యక్తం చేసింది.

అదలా ఉంటే శివసేనలో చీలిక వచ్చిన అనంతరం జరుగతున్న తొలి ఎన్నిక కావడంతో, అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక అప్పట్లో ఎనలేని ప్రాధాన్యత  సంతరించుకుంది.  సరే ఆ ఉప ఎన్నికలో శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం విజయం సాధించింది. జనం మా వెంటనే ఉన్నారని ఈ ఫలితం రుజువు చేసిందని అప్పట్లో ఉద్ధవ్ థాక్రే విజయ హాసం చేశారు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం.. శివసేన ఎన్నికల గుర్తును.. షిండే వర్గానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్ధవ్ థాక్రే అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. సుప్రీంలో ఉన్న అంశంపై ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవలసిన అగత్యం ఏమొచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. అయితే సుప్రీం అత్యవసర విచారణకు నిరాకరించిందనుకోండి అది వేరే సంగతి.

ఉద్ధవ్ థాక్రే పిటిషన్ మంగళవారం ( ఫిబ్రవరి 21)న బెంచ్ మీదకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పిట్ట తగవు.. పిట్ట తగవు పిల్లి తీరిస్తే ఇరు పక్షాలకూ కూడా అన్యాయమే జరగాలి.. కానీ శివసేన గుర్తు విషయంలో మాత్రం ఈసీ నిర్ణయాలను షిండే వర్గం మాత్రమే స్వాగతిస్తోంది. అంటే ఈసీ పిల్లి వివక్ష చూపుతోందా? అన్న అనుమాలు వ్యక్తమౌతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పుతో మాత్రమే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.