సరసమైన ధరలకు విమానాశ్రయాలలొ ఆహారం అందించేందుకు ఉద్దేశించిన ఉడాన్ యాత్రి కేఫ్ ను చెన్నై విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం (ఫిబ్రవరి 27) ప్రారంభించారు. రెండు నెలల కిందట ఉడాన్ యాత్రి కేఫ్ ను కోలకత్తాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభమైంది, ఇది ప్రయాణికులకు బడ్జెట్-స్నేహపూర్వక ఎంపికలను అందిస్తుంది. త్వరలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ప్రారంభం కానుంది.
విమానాశ్రయంలో తినుబండారాలు, కాఫీ, టీ వంటి వాటి ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ఆఖరికి వాటర్ బాటిల్ కూడా ప్రియమే. దీంతో విమానప్రయాణీకులకు సరసమైన ధరలకే ఆహారం, పానీయాలు అందించాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటి ఉడాన్ యాత్రి కేఫ్ కోల్ కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఏడాది డిసెంబర్ 19న ప్రారంభమైంది. ఈ కేఫ్ విమాన ప్రయాణీకుల అభిమానాన్ని చూరగొంది. నాణ్యత, రుచి ధరలపై సర్వత్రా సంతృప్తి వ్యక్తమౌంది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రాయాలలోనూ వీటిని ప్రారంభించాలన్న డిమాండ్ వెల్లువెత్తింది. దీంతో విమాన ప్రయాణీకుల డిమాండ్ మేరకు వీటిని దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకూ విస్తరించాలని భావిస్తున్నారు.
ఉడాన్ యాత్రి కేఫ్ లో వాటర్ బాటిల్ పది రూపాయలకు, టీ పది రూపాయలకు లభిస్తాయి. ఇక కాఫీ ధర అయితే 20 రూపాయలు మాత్రమే. ఇప్పటి వరకూ అధిక ధరలకు వీటిని కొనుగోలు చేసిన విమాన ప్రయాణీకులు ఉడాన్ యాత్రి కేఫ్ అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సమోసా, స్వీట్ కూడా 20 రూపాయలకే లభిస్తుంది. విమానయానాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా విమానాశ్రయాలలో ప్రయాణీకులకు అందుబాటు ధరలో ఆహారం, టీ, కాఫీ అందించే ఉద్దేశంతో ఉడాన్ యాత్రి కేఫ్ ల ఏర్పాటుకు కేంద్రం సమయాత్తమౌతోంది. అందులో భాగంగానే తొలుత కోల్ కతా, ఆ తరువాత చెన్నై ఎయిర్ పోర్టులలో వీటిని ఏర్పాటు చేసింది. త్వరలో ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఉడాన్ కేఫ్ అందుబాటులోకి రానుంది. దేశ వ్యాప్తంగా విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం ప్రవేశ పెట్టిన ఉడాన్ పథకంలో భాగమే ఉడాన్ యాత్రీ కేఫ్ లను కేంద్రం ప్రారంభిస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/udaan-yatri-cafe-started-in-chennai-39-193631.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.