Publish Date:Sep 12, 2024
మధ్యప్రదేశ్ లో అరాచకం రాజ్యమేలుతోందా? చట్టం, శాంతి భద్రతల ఆనవాలే కనిపించడం లేదా? అంటే ఆ రాష్ట్రంలో పెరుగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులు, దౌర్జన్యాలు అరాచకాలు, అత్యాచార ఘటనలను చూస్తే ఔనని అనక తప్పదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనిపించేలా, అడుగు తీసి బయటకు వెడితే క్షేమంగా తిరిగి ఇంటికి చేరుతామా అని జనం భయపడే పరిస్థితులు ఉన్నాయనడానికి తాజాగా ఇండోర్ లో జరిగిన దారుణ ఘటనే నిదర్శనం.
సరదాగా తమ స్నేహితురాళ్లతో విహార యాత్రకు వెళ్లిన ఇద్దరు శిక్షణలో ఉన్న ఆర్మీ అధికారులపై కొందరు దుండగులు దాడి చేశారు. సాయుధులైన ఎనిమిది మంది ముఠా తుపాకులతో బెదరించి వారి వద్ద ఉన్న సొత్తు దోచుకున్నారు. ఆర్మీ ట్రైనీ ఆఫీసర్ల స్నేహితురాళ్లలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఒక ఆర్మీ ట్రైనీ ఆఫీసర్ ను, ఒక మహిళను బందీగా పట్టుకుని మిగిలిన ఇద్దర్నీ పది లక్షల రూపాయలు ఇచ్చి విడిపించుకు వెళ్లాలంటూ పంపించారు. ఈ సంఘటన జరిగింది ఎక్కడో మారుమూల ప్రదేశంలో కాదు. ఇండోర్ లో ని మావు ఆర్మీ కాలేజీకి కూతవేటు దూరంలో జరిగింది.
తమ స్నేహితురాళ్లతో సరదాగా కాలేజీకి సమీపంలోని ఫైరింగ్ రేంజ్ వద్దకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ ఆఫీసర్లను సాయుధులైన ఎనిమిది మంది దుండగులు చుట్టుముట్టి తుపాకులతో బెదరించారు. దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఇద్దరిని బందీలుగా పట్టుకుని వారిని విడిచిపెట్టడానికి సొమ్ములు డిమాండ్ చేశారు. ఇదంతా ఆర్మీ ట్రైనింగ్ కాలేజీకి కేత వేటు దూరంలో జరిగిందంటే దుండగులు ఎంతగా బరితెగించారో అర్ధమౌతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలోగానే దుండగులు తప్పించుకున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అరెస్టైన వారికి నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన మంగళవారం (సెప్టెంబర్ 10) సాయంత్రం జరిగింది. సాయుధులు యథేచ్ఛగా తుపాకులు, మారణాయుధాలతో అదీ ఆర్మీ కాలేజీకి సమీపంలోనే సంచరిస్తోందంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత సుందరముదనష్టంగా ఉందో అవగతమౌతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-trainee-army-officers-robbed-25-184664.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్