Publish Date:Sep 12, 2024
ప్రతిభ, సామర్ధ్యం ఉంటే పదవులు హోదాలు వాటంతట అవే వచ్చి చేరతాయనడానికి నిలువెత్తు నిదర్శనంగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మెహన్ నాయుడు నిలుస్తారు. తండ్రి కింజరపు ఎర్రన్నాయుడి మరణంతో తండ్రివారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రామ్మోహన్ నాయుడు అనతి కాలంలోనే తండ్రికి మించిన తనయుడిగా తనదైన ముద్ర వేశారు.
2014, 2019, 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అత్యంత పిన్న వయస్సులోనే కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అదీ పౌరవిమానయాన శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు. లోక్ సభలో తన అనర్గళ ప్రసంగాలతో అందరి దృష్టీ ఆకర్షిస్తున్నారు. పార్లమెంట్లో రామ్మోహన్నాయుడి పనితీరు ఆధారంగా 2020లో సంసద్ రత్న 'జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు’ అందుకున్నారు. అతి చిన్న వయస్సులోనే సంసద్ రత్న అవార్డు అందుకున్న రికార్డును సొంతం చేసుకున్నారు.
తాజాగా ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌లో సభ్య దేశాల ఛైర్మన్ ఎన్నిక బుధవారం (సెప్టెంబర్ 11) జరిగింది. ఆ ఎన్నికలో ఆసియా ఫసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంటే 40 సభ్య దేశాల ప్రతినిధులు రామ్మోహన్ నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్న మాట. దేశం తరఫున తనకు దక్కిన ఈ గౌరవాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నట్లు పేర్కొన్న కింజారపు విమానయాన రంగాన్ని ప్రజలకు చేరువగా తీసుకురావడంతో పాటు ఆసియా ఫసిఫిక్ దేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-key-post-to-kinjarapu-rammohan-naidi-25-184668.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్