Publish Date:Oct 24, 2021
ఏపీలో జగన్ సర్కారు అరాచకానికి అంతు లేకుండా పోతోంది. అమ్మవారి భక్తుల సెంటిమెంట్లు పట్టడం లేదు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని అందరూ చూస్తుండగానే దారుణంగా అవమానించారు. అసలు హిందువుల సెంటిమెంట్లంటేనే జగన్ ఖాతరు చేయడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి వందకు పైగా ఆలయాలు, విగ్రహాలు ధ్వంసం అయ్యాయి.
హిందువుల మీద విపరీతమైన ద్వేషం ప్రదర్శించేవారిని వెనకేసుకొస్తున్న జగన్ వైఖరి కారణంగానే.. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మరో రెండు ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఆంజనేయస్వామి గుడిని కొట్టేసి విగ్రహాన్ని దగ్గరలోనే ఉన్న బావిలో పడేయడం హిందూ భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. నిత్య పూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం తమ కళ్ల ముందే బావిలో పడేస్తుంటే ఏం చేయాలో, ఎవరిని నిలదీయాలో తెలియక అమాయకులైన పాతపట్నం గ్రామప్రజలు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. ఆ దృశ్యాలు కాస్తా కొందరు విలేకరుల దృష్టికి రావడంతో ఈ అరాచకం బయటపడింది.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే స్థానిక పెట్రోల్ బంకు దగ్గర నుంచి ఫ్లైఓవర్ వెళ్తోంది. ఆ పెట్రోల్ బంకు వద్దనే ఆంజనేయస్వామి గుడి ఉంది. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వచ్చిన సిబ్బంది ఆలయాన్ని పూర్తిగా కొట్టేయాలంటూ ముందుకొచ్చారు. స్థానికులు, గుడి పూజారి అధికారుల ముందుకొచ్చి ఒక గంట సమయం ఇవ్వాలని ఎంతో ప్రాధేయపడ్డా వినకుండా అప్పటికప్పుడే ఆంజనేయస్వామి గుడిని పూర్తిగా నేలమట్టం చేశారు. గుడిని నేలమట్టం చేయడం ఒక ఎత్తయితే... ప్రతిరోజూ పూజలందుకునే ఆంజనేయస్వామి విగ్రహం మీద కక్ష కట్టినట్టు.. దాన్ని బావిలో పడేయడాన్ని మాత్రం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంజనేయస్వామి భక్తుల మనోభావాలు, హిందువుల సెంటిమెంట్లు దారుణంగా గాయపడ్డాయి.
గుడిని గానీ, ఏదైనా ప్రార్థనా స్థలాన్ని గానీ తొలగించాలంటే ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆస్తికి ఇచ్చేపాటి విలువ కూడా హిందువుల ఆరాధ్య దైవానికి ఇవ్వకపోవడంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా, కనీసం విగ్రహాన్ని తరలించే సమయం కూడా ఇవ్వకుండా కక్ష కట్టినట్టు వ్యవహరించడమేంటని ప్రజలంతా నిలదీస్తున్నారు. ఈ గుడినే నమ్ముకున్న పూజారి కుటుంబం రోడ్డున పడి విలపిస్తోంది. గుడినే జీవనాధారంగా బతుకుతున్న తమకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
పాతపట్నం ప్రజల హాహాకారాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్లైఓవర్ నిర్మాణకర్తల విధ్వంసకాండ కొనసాగింది. అక్కడే ఉన్న నీలమణి దుర్గమ్మ గుడి మీద కూడా ప్రతాపం చూపారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎంతో దైవంగా కొలిచే అమ్మవారి గుడిని సగభాగం కొట్టేశారు. దీంతో ఆ ప్రాంతమంతా భయానకమైన వాతావరణం కమ్ముకొంది. స్థానిక ప్రజలంతా ఈ అరాచకాన్ని ఆపేదెవరు.. తమ గోడు వినేవారెవరు... అంటూ రోదిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకైనా చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా, తమకు సమయం ఇవ్వకుండా ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని రెండు గుళ్లను కొట్టేయడమేంటని ప్రజలు నిలదీస్తున్నారు. మరి జగన్ ఈ విషయం మీద ఎలా స్పందిస్తారో చూడాలంటున్నారు స్థానికులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-temples-demolish-in-ap-without-notice-39-125097.html
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.