ఐదేళ్లు.. జస్ట్ ఐదేళ్లు.. పవన్ పురోగమనం.. జగన్ తిరోగమనం?

Publish Date:Feb 26, 2024

Advertisement

ఐదేళ్లు.. జస్ట్ ఐదేళ్లు.. అవును 2019 ఎన్నికల నుంచి 2024 ఎన్నికల వరకూ ఈ ఐదేళ్ల కాలంలో ఇద్దరు నాయకుల పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఒకరు రాజకీయ పరిణితితో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. మరో నాయకుడు తన పట్ల జనం చూపిన ఆదరణ, అభిమానాలను పూర్తిగా పోగొట్టుకుని వారి ఆగ్రహానికి గురై విఫల నేతగా మిగలడమే తరువాయి అన్న పరిస్థితికి చేరుకున్నారు.  ఇంతకీ వారిరువురూ ఎవరంటే ఒకరు అధికార వై సీపీ అధినేత జగన్.. మరొకరు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 2019 ఎన్నికలలో  జగన్ అశేష ప్రజాభిమానంతో అధికారంలోకి వస్తే.. పవన్ కల్యాణ్  జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించి చతికిల పడింది. పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయాన్ని మూటగట్టుకుని విఫల నేతగా మిగిలారు. అది పక్కన పెడితే ఈ ఐదేళ్ల కాలంలో జగన్ తన పట్ల ప్రజలు చూపిన అభిమానం, ఆదరణను ప్రజాగ్రహంగా మార్చుకుంటే.. అదే ఐదేళ్ల కాలంలో పవన్ కల్యాణ్ తన రాజకీయ పరిణితిని చాటుకుని ప్రజాభిమానాన్ని ప్రోది చేసుకున్నారు. వాస్తవ బలం, రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అవసరాలు, భివిష్యత్, ప్రజల ఆకాంక్షలు, ఆశలు, వారి నాడి అన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని తమ పార్టీ ఈ ఎన్నికలలో ఎన్ని స్థానాలలో పోటీలో ఉండాలి, పొత్తులో భాగంగా ఏ మేరకు త్యాగాలకు సిద్ధపడాలి అన్న విషయంలో  గ్రౌండ్ రియాలటీ మేరకు ఆచరణాత్మకంగా ఆలోచించి అడుగులు వేస్తుంటే.. జగన్ మాత్రం ప్రజాగ్రహాన్ని పట్టించుకోకుండా సిద్ధం అంటూ చొక్కాలు మడతపెట్టేయాలంటూ పార్టీ క్యాడర్ ను రెచ్చగొడుతున్నారు. 

2019 ఎన్నికల సమయంలో పొత్తులకు నో చెప్పి పవన్ కల్యాణ్ తాను ఓడటమే కాకుండా, అప్పటి అధికార పార్టీ పరాజయానికి కూడా పరోక్షంగా కారకుడయ్యారు. కానీ ఆ తరువాత పొరపాటు గ్రహించి సరిదిద్దుకోవడానికి ఇసుమంతైనా వెనుకంజ వేయలేదు. అదే సమయంలో గత ఎన్నికలలో తనకు లభించిన ప్రజాదరణతో అహంకారం తలకెక్కిన జగన్, హామీలను విస్మరించి, అధికారమంటే రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే అన్నట్లుగా వ్యవహరించి ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్నారు.  

పవన్ కల్యాణ్ 2019 ఎన్నికలలో పరాజయం తరువాత ప్రజలలోనే ఉంటూ, ఓటమికి కారణాలను విశ్లేషించుకున్నారు.  పొరపాట్లను సవరించుకుంటూ వేగంగా వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలని అర్ధం చేసుకున్నారు. అధికారమంటే ప్రజలను పీల్చి పిప్పి చేయడం, తనను వ్యతిరేకించే వారిపై కక్ష సాధింపులకు పాల్పడటం, ప్రజాగళం వినిపించకుండా నిర్బంధ కాండను ప్రయోగించడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్ ను గద్దె దింపడమే ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు మేలు అన్నది గ్రహించి ఆయన గత ఎన్నికలలో ససేమిరా అన్న పొత్తుకు  ఇప్పుడు స్వయంగా పవన్ కల్యాణే స్వాగతం పలికారు. అదే విధంగా సీట్ల పంపకాల విషయంలోనూ ఎక్కడా తూకం చెడకుండా, అలాగే తన గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించారు. అంతే కాకుండా పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేతతో కలిసి ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటనకు అంగీకరించారు. వాస్తవ బలం మేరకే సీట్లు కోరుతానని చెప్పిన ప్రకారమే ఆయనే స్వయంగా తమ పార్టీ 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని ప్రకటించారు. తన నిర్ణయంతో విభేదించే ఎవరైనా సరే నిరభ్యంతరంగా జనసేనను వీడి వెళ్లిపోవచ్చని పార్టీ శ్రేణులకు ఎలాంటి శషబిషలకూ తావు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.  

టిడిపి, జనసేనల పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు తీసుకోవడంపై ఏపీ కాపు సంక్షేమ సంఘం నేత హరిరామ జోగయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో స్వయం ప్రకటిత కాపు నేత హరిరామ జోగయ్య ప్రస్తావించిన ప్రతి అంశానికీ జగన్ గతంలో ఎప్పుడో, అంటే చేగొండి హరిరామ జోగయ్య ప్రశ్నించకముందే, పొత్తులో భాగంగా తాను కోరబోయే సీట్ల సంఖ్య గురించి ప్రస్తావిస్తూన్న సందర్భంగానే బదులిచ్చేశారు. రెండుమూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు వాటిలో పెద్ద పార్టీకి ఎక్కువ సీట్లు లభించడం సహజం. కనుక సీట్ల సర్దుబాట్లు అనివార్యం. ఆ విషయం గుర్తించిన జనసేనాని వాస్తవ అంచనాలకు లోబడే సీట్ల పంపకంతా తమ పార్టీ వాటా తీసుకున్నారు. దీనిని గుర్తించకుండా హరిరామ జోగయ్య చేస్తున్న విమర్శలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదని పవన్ భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గం కూడా పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. హరిరామ జోగయ్య వంటి నేతలు పొత్తు విచ్ఛిన్నం చేయడం కోసం వైసీపీ తరఫున పని చేస్తున్న కోవర్టులా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటూ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ దశలో వాస్తవాన్ని గుర్తించి కాపు సామాజికవర్గం పవన్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నదని అంటున్నారు.  

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.