Publish Date:Sep 21, 2024
రాజమౌళి ‘ఈగ’చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్లో సుదీప్ నటించాడు. హీరో నానిని హత్య చేస్తే మరో జన్మలో నాని ఈగ రూపంలో జన్మిస్తాడు. హీరోయిన్ సమంతకు ఈ విషయం తెలిసిపోతుంది. హీరో ఈగ, సమంతలు కల్సి సుదీప్ ను హత్య చేస్తారు. .ఈగను అగ్నికి అహుతి చేయాలని ప్రయత్నించి తానే ఆ మంటల్లో అహుతి అవుతాడు సుదీప్. అది రీల్ స్టోరీ. ఇది మాత్రం రియల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో పొలం పనులు చేసుకునే కూలీలను తేనెటీగలు దాడి చేసి హత్య చేశాయి. లక్షలాది తేనెటీగలు ;పొలం పనులకు వచ్చిన ఇద్దరు కూలీలను పొట్టనబెట్టుకున్నాయి. ఎప్పటి మాదిరిగా సద్దిమూట కట్టుకుని పొలం పనులకు వచ్చిన ఈ కూలీల బతుకు అదే రోజు తెల్లారిపోయింది. తాము వెంట తెచ్చుకున్న సద్ది మూటే వారికి చివరి మెతుకులయ్యాయి. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వారిలో కిల్లరి కాంతమ్మ, కిల్లరి కిష్టప్ప ఉన్నారు. వీరిరువురు భార్య భర్తలు. మరో ముగ్గురు కూలీలు తీవ్ర గాయాలతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కెజీహెచ్ కు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారి చేయడంతో ప్రస్తుతం అక్కడికి తీసుకెళ్లినట్లు సమాచారం. నేరం జరగగానే పోలీసులు సీన్లో ఎంటరయ్యారు.తేనెటీగల దాడి వివరాలను పోలీసులు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-laborers-died-in-the-attack-of-bees-and-the-condition-of-three-others-is-critical-25-185287.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.