బొత్స ఇలాకాలో వైసీపీ జీరో: వలసలు, సస్పెన్షన్లు.. అసలేం జరుగుతోంది.?

Publish Date:Oct 3, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత జిల్లాలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత మనుషులే ఆయనకు, ఆయన పెద్ద దిక్కుగా ఉన్న పార్టీకీ దూరం అవుతున్నారు. ఆయన సొంత మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఇది జిల్లాలో పార్టీకే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురు దెబ్బే కాకుండా పూడ్చలేని నష్టం కూడా. అయితే ఆ తరువాత కూడా జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 

తాజాగా  మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ.. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.  పార్టీ అధిష్టానం తనపై వేసిన సస్పెన్షన్ వేటుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విస్పష్టంగా ప్రకటించారు.  సొంత పార్టీ నేతల వైఖరి, నాయకత్వ సరళిపై విమర్శలు గుప్పించిన ఆయన త్వరలో తన కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా.. నేతలు పార్టీ వీడిన తరువాత, సమావేశాలు ఏర్పాటు చేసో, అసంతృప్తులను పలిపించుకునో బుజ్జగింపు చర్యలకు దిగుతుంది. పార్టీ నుంరచి వలసలు పెరగకుండా నివారణ చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా వైసీపీలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. 

మజ్జి పార్టీకి రాజీనామా చేసిన తరువాత జరిగిన విజయనగరం జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది, ఇప్పుుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు.. అప్పుడు నాడు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తాను వైపీలోనే కొనసాగుతానని ప్రకటించారు.  అలా ఆయన ప్రకటించిన రోజు రాత్రే పార్టీ హైకమాండ్ ఆయనను నెల్లమర్ల నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తొలగించింది.  దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనను పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫారసుల మేరకు అంటూ  పార్టీ నుంచే సస్పెండ్ చేసింది.  

 

స్పెన్షన్ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరంలో తన అనుచరులు, అభిమానులతో సమావేశం నిర్వహించి, పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను, అవమానాలను వారికి వివరించారు. గౌరవం లేని చోట తాను, తన అనుచరులు కొనసాగలేమని స్పష్టం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్‌పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.

జగన్ వైసీపీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుపుతున్నారని దుయ్యబట్టారు. ఆయన నియంతృత్వ పోకడల కారణంగానే ప్రజాగ్రహానికి గురై గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు.  మజ్జి శ్రీను తనకు బావ అవుతారన్న ఒకే ఒక్క కారణంతో తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా చర్యలు తీసుకున్నారని విమర్శించారు. అదే రీతిలో పరిశీలిస్తే మజ్జి శ్రీనుకి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా బంధువు అవుతారని, ధైర్యం ఉంటే ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలనీ సవాల్ విసిరారు.  


[YCP Vizianagaram Crisis, Baddukonda Appalanaidu Resignation, Nellimarla Former MLA YCP, Vizianagaram Politics, Botsa Satyanarayana, Telugu One]

By
en-us Political News

  
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.