రక్తసిక్తమైన దేవరగట్టు కర్రల సమరం.. ఇద్దరు మృతి
Publish Date:Oct 2, 2025
Advertisement
ఏటా విజయదశమి రోజున కర్నూలు జిల్లా దేవరగట్టు లో జరిగే కర్రల సమరం ఏ ఏడాది రక్త సిక్తంగా మారింది. సంప్రదాయబద్ధంగా ఏటా జరుపుకునే ఈ బన్నీ ఉత్సవంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దేవతా మూర్తులను గ్రామానికి తీసుకువెళ్లే విషయంలో కర్రల సమరం నిర్వహించడం దేవరగట్టు ఆచారం అన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈ కర్రల సమరంలో ఇద్దరు మరణించారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. ఏటా సంప్రదాయం ప్రకారం దేవరగట్టులో విజయదశమి నాడు దేవతామూర్తులకు గ్రామానికి తీసుకువేళ్లేందుకు మూడు గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, ఏడు గ్రామాల ప్రజలు మరో వర్గంగా కర్రలతో తలపడతారు. చెడుపై మంచి విజయం సాధించడానికి ప్రతీకగా ఏటా జరుపుకునే ఈ ఉత్సవం రక్తసిక్తం కావడం కద్దు. ఈ ఏడాది కూడా విజయదశమి రోజున అంటూ గురువారం (అక్టోబర్ 2) అర్ధరాత్రి స్వామి, అమ్మవారి విగ్రహాల ఊరేగింపు జరిగింది. యథావిథిగా దేవతామూర్తులను తీసుకువెళ్లేందుకు రెండు వర్గాలు కర్రలతో పోటాపోటీగా తలపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన కర్రల సమరంలో ఇద్దరు మరణించగా, మరో వంద మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
http://www.teluguone.com/news/content/two-killed-in-devaragattu-karrala-samaram-36-207244.html





