Publish Date:Jul 15, 2025
మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినఆపరేషన్ కగార్ సత్ఫలితాలనే ఇస్తోందని అంటున్నాయి భద్రతా బలగాలు. ఆపరేషన్ కగార్ కారణంగా పలువురు మావోయిస్టులు పలు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. హతమైన నక్సల్స్ లో కీలక మావోయిస్టు నేతలు ఉన్నారు. ఇక పోతే ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు సహా పెద్ద సంఖ్యలో నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. అందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మంగళవారం (జులై 16)న లొంగిపోనున్నారు.
తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న, బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ రామగుండం సీపీ ఎదుట లొంగిపోనున్నారు. వీరి లొంగుబాటు రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బేనని పరిశీలకులు అంటున్నారు. ఆపరేషన్ కగార్ కారణంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. లొంగిపోయిన నక్సల్స్ కు ప్రభుత్వం పాతిక వేల రూపాయల తక్షణ సాయం, వైద్యం, పునరావాసం వంటివి కల్పిస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-key-maoists-surrender-39-202012.html
హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో గంట పాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి.
ఏపీలో ట్రైబల్ శాఖలో ఓ ఉన్నత స్థాయి అధికారి అవినీతి బాగోతం బయటపడింది. ఆ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) అబ్బవరపు శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడలో అరెస్ట్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరాన్నికి క్లౌడ్ బరస్ట్ ముప్పు పొంచి ఉందని వాతవరణ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.
విశాఖ నగరంలో ఫిషింగ్ హార్బర్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా..ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులోకి కేంద్రం ఎంటరైంది. ఈ వ్యవహారం జాతీయ అంశమని తొలి నుంచీ బీజేపీ చెబుతూనే ఉంది.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
నకిలీ ఓటర్ల జాబితాలతో ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
వైసీపీ నేత తూరకా కిశోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్దంగా తూరకా కిశోర్‌ను అరెస్ట్ చేశారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలతో విరుచుకుపడితే.. ప్రతిగా భారత్ పక్కా వ్యూహంతో ఆయన మెడలు వంచి దారికి తీసుకురావడానికి వ్యూహాలు రచిస్తోందా? అంటే మోడీ చైనా పర్యటన, అదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనలు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం నెలకొంది. స్ధానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ శ్యామ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.