రఘురామ, విజయసాయి ట్వీట్ వార్

Publish Date:Jun 13, 2022

Advertisement

ఇద్దరూ వైసీపీ ఎంపీలే.. అయినా వారిద్దరి మధ్య ట్విట్ల వార్ ఓ రేంజ్ లో జరిగింది. ఒకరు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. మరొకరు అదే పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. వైసీపీ సర్కార్ తప్పిదాలను, దాష్టీకాలను, దౌర్జన్యాలను, దుర్మార్గాలను ఎత్తి చూపుతూ తనదైన స్టైల్ లో రఘురామకృష్ణరాజు   మీడియా ముఖంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం ఆయన ‘మద్యం పూర్తిగా నిషేధిస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 8 వేల కోట్ల రూపాయల రుణం సమీకరించడం, తన అనర్హత పిటీషన్ పై లోక్ సభ స్పీకర్  కార్యాలయ స్పందన, ఇతర ముఖ్య అంశాలపై   రచ్చబండ’ అని రఘురామ ట్వీట్ చేశారు.  దీంతో రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి రఘురామరాజుపై వ్యక్తిగత విమర్శలతో ట్వీట్ చేయడంతో వారిద్దరి మధ్య ట్వీట్ వార్ ఓ రేంజ్ లో సాగింది.

‘ఢిల్లీలో కూర్చొని జోస్యాలు చెప్పే నర్సాపురం నక్కకి సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాల’ని రఘురామను రెచ్చగొట్టేలా విజయసాయి ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా నాలుగు పచ్చ కుల ఛానెల్స్ మైకులు ముందు పెట్టుకుని మొరగడం కాదు.. నియోజకవర్గంలో తిరిగితే విగ్గు రాజుకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తందం’టూ తీవ్ర పదజాలంతో ట్వీట్ చేశారు. ‘అడగకుండా నియోజకవర్గం వదలి అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేసే ఏకైక రాజు.. విగ్గురాజు.. పెగ్గురాజు’ అంటూ రెచ్చగొట్టారు. దీంతో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. విజయసాయి చేసిన  వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు,  ‘హలో రసిక వానరా! అవును నాకు ఉన్నది విగ్గు.. ఎన్ని తన్నులు తిన్నా నీకు లేనిది సిగ్గు. కొత్తగా రాజీనామా అంటున్నావు? నువ్వు, నీ గ్యాంగ్ లీడర్ అనర్హత/ సస్పెన్షన్ పై చేతులు ఎత్తేశారా? నేను ఏపీకి వస్తే ముఖ్యమంత్రికి దిమ్మతిరిగి మైండ్  బ్లాక్ అవ్వుద్ది అనేగా నాపై కేసులు పెట్టిస్తున్నారు’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. ‘అజ్ఞాతవాసం తర్వాత పాండవులకి, అరణ్య వాసం తరువాత శ్రీరాముడికి జరిగింది పట్టాభిషేకం. చచ్చింది కౌరవులు, దానవులు. తెలుసుకోరా కండోమ్ రెడ్డి!!’ అంటూ ఓ స్థాయిలో రఘురామ కృష్ణం రాజు రిటార్డ్ ఇచ్చారు. 

అప్పటికైనా విజయసాయికి సిగ్గొచ్చిందా అంటే.. ‘ఒరేయ్ డూప్లికేట్ గాజు.. నీ మీసాలైనా ఒరిజిలేనా? లేక పీకి అంటించుకున్నావా? వాటిని మెలి తిప్పడం ఎందుకురా?’ అంటూ మరింత వ్యక్తిగతంగా వెళ్లి మరీ అసందర్భ వ్యాఖ్యలతో ట్వీట్ పెట్టి. రెచ్చగొట్టారు. దానికి బదులుగా రఘురామ ‘’ఎవడు ఒరిజినల్ రాజో.. ఎవడు డూప్లికేట్ రెడ్డో ప్రజలకి ‘ఎరుక’లే రా! మనం కలిసినప్పుడు నా వెంట్రుకలన్నీ చూపిస్తా.. నువ్వే పీకి చూస్కో!’అంటూ ట్వీట్ చేశారు రఘురామ రాజు. వీరి ట్వీట్లపై నెటిజన్లు కూడా ఓ స్థాయిలో స్పందిస్తున్నారు. నెటిజన్ల స్పందన రఘురామ రాజుకు అనుకూలంగా ఉండటం విశేషం. నెటిజన్లు సెటైర్లతో విజయసాయికి దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా చేస్తున్నారు.    విజయసాయి ఒక రాక్షస జంతువని,   పైశాచికానందం ఎక్కువ అంటూ కొందరు ఫైరవుతున్నారు. ‘తెల్ల తాతకి దూల తీరిపో యిందం’టూ మరి కొందరు సైటైర్లు దంచారు.

ముసలోడికి ముందుంది జైళ్ల పండుగ అని ఇంకొకరు,   కండోమ్ తాతకు అడిగి మరీ తన్నించుకోవడం బాగా అలవాటంటూ మరొకరు, వెంట్రుకలు పండాయి,రేపో మాపో కాటికి పోయే వయసులో… డిక్కీ బలిసి కొట్టుకుంటున్నాడని ఇంకో నెటిజన్, రాజుగారూ ఈడీ చానల్ ని కూడా పిలవండి. పాపం నక్కబొక్కల రెడ్డి తెగ మధనపడిపోతున్నాడంటూ మరొకరు.. ముసలి నక్కకు రాజుగారు డైరెక్ట్ గా గునపమే దింపారంటూ ఇంకో నెటిజన్ పంచ్ వేశారు. మొత్తానికి రాజు వర్సెస్ రెడ్డి ట్వీట్ వార్ లో నెటిజన్లు కూడా రఘురామకు మద్దతుగా నిలుస్తుండడం విశేషం.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.