అంబటి రాంబాబు- నాగబాబు- మధ్యలో బండ్ల గణేష్

Publish Date:Aug 17, 2022

Advertisement

ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జనసేన నేత కొణిదెల నాగబాబు మధ్య ట్విట్టర్ వేదికగా  ప్రాసలతో విమర్శలు పడుతున్నాయి. పంచ్ లు పేలుతున్నాయి. వీరి మధ్యలో అంబటిపై నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్, జనసేన శ్రేణులు, పవన్ ఫ్యాన్స్. వీరంతా  తమ  శైలిలో ట్వీట్ల వార్ రసవత్తరంగా కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు, సెటైర్లతో ఏపీలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశారు. ఈ వార్ ప్రారంభించింది మంత్రి అంబటి రాంబాబు. వివాదానికి మూల కారణం చేనేత చాలెంజ్.

చేనేత వస్త్రం ధరించి, ఫొటో పోస్ట్ చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చాలెంజ్ విసిరారు. ఆ చాలెంజ్ ను స్వీకరించిన పవన్ కళ్యాణ్ అదే చాలెంజ్ ను టీడీపీ చీఫ్ చంబ్రబాబు నాయుడికి మరో ఇద్దరికి విసిరారు.  దీంతో తెర మీదకి వచ్చిన మంత్రి అంబటి.. ‘పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేస్తారా? లేదా?’ అంటూ సెటైర్ వేయడంతో ట్వీట్ల వార్ స్టార్ట్ అయింది. అంబటి ట్వీట్ కు స్పందించిన జనసేన నేత నాగబాబు.. రాంబాబు మార్ఫింగ్ ఫొటోతో జవాబు ఇచ్చారు.

దీనిపై స్పందించిన అంబటి ‘బాగా ఖాళీగా ఉన్నట్లున్నారు’ అంటూ నాగబాబుపై రీ ట్వీట్ చేయడం గమనార్హం. ‘పవన్ కళ్యాణ్ గారూ.. కాటన్ దుస్తులు చాలెంజ్ ఆపి ఇంతకీ 175 సీట్లలో పోటీ చేస్తున్నారా లేదా, ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించండి’ అని అంబటి రాంబాబు చేసిన ట్వీట్ కు మార్ఫింగ్ ఫొటోతో నాగబాబు దీటుగా జవాబు ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ను తన దేవుడిగా చెప్పుకునే సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ‘అలాగే రంభల రాంబాబుగారు.. మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారు.. జై పవన్ కళ్యాణ్’ అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు.

మంత్రి అంబటి సెటైర్ కి జనసేన నేత నాగబాబు ఊహించని స్థాయిలో రీ ట్వీట్ చేశారు. ‘ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా! బాబూ.. ఓ రాంబాబు.. జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి, వైసీపీ సర్కస్ లో నీ లాంటి బఫూన్ గాళ్లు అడిగే  క్లారిఫికేషన్స్ కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకు గానీ, పవన్ కళ్యాణ్ కు గానీ   లేదు’ అని ట్వీట్ చేస్తూ.. అంబటి ఫొటోను మార్ఫింగ్ చేసి, జతచేశారు. నాగబాబు రీ ట్వీట్ పై మళ్లీ అంబటి మరో సెటైర్ వేస్తూ.. ‘భలే ఓరండీ నాగబాబుగారు, ఎంత ఓపిగ్గా, ఎంత తీరిగ్గా నా బొమ్మేశారండి.. ఖాళీగా ఉన్నట్లున్నారు.. ధన్మవాదాలు’ అంటూ రీ ట్వీట్ చేయడం గమనార్హం.

ఆపైన అంబటి రాంబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ‘జై జనసేన.. జైజై పవన్ కళ్యాణ్.. బాబు ఓ రాంబాబు మీ బుద్ధి మారుదు రాంబాబు’ అంటూ ఓ అభిమాని అంబటిని ఏసుకున్నాడు. ‘నీలాంటి పాలేరు గాడికి సమాధానం చెప్పాలేంట్రా రంభల రాంబాబు’ అని మరో ఫ్యాన్ కౌంటర్ వేశాడు. ‘రాసలీలల రాంబాబు’ అని ఒకరు, ‘పాలేరు రాంబాబు’ అంటూ ఇంకొకరు, ‘గుడివెనుక నాసామి రాంబాబు’ అంటూ మరో అభిమాని అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.