కోలీవుడ్ దళపతి.. తమిళనాడు అధిపతి.. సీఎంగా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం

Publish Date:May 9, 2026

Advertisement

కోలీవుడ్ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీరూ ) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం ( మే 10) ఉదయం 10 గంటలకు ఆయన తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం అటు అభిమానులు, ఇటు రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.

గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే,  ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.   ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.

విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఆయన తండ్రి.. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ ఒకింత  భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడి ఘనవిజయంపై  స్పందిస్తూ..  . ఒక తండ్రిగా తాను ఏం చేసినా అది తన కుమారుడి శ్రేయస్సు కోసమేనని, ఈ రోజు విజయ్ సాధించిన విజయం నిజానికి తమిళ ప్రజల విజయమని ఆయన కొనియాడారు.

ఇదే క్రమంలో కాబోయే ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిర్ణయం తమిళ ప్రజల సంక్షేమం కోసమే ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలని  సూచించారు. కేవలం అధికారం కోసమే కాకుండా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సినిమా రంగంలో అగ్రనటుడిగా వెలుగొందిన విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ అత్యున్నత పదవిని చేపట్టడం తమిళనాడు చరిత్రలో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్న విజయ్, ప్రజా సమస్యల పరిష్కారంలో ఏ విధంగా ముందుకు సాగుతారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.  

అంతకు ముందు అంటే శనివారం (మే 9) సాయంత్రం టీవీకే అధినేత విజయ్ తనకు మద్దతు ఇచ్చే పార్టీల సమ్మతి లేఖలతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిశారు.  . అనంతరం ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో విజయ్ ఆదివారం (మే 10) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

By
en-us Political News

  
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.