టీవీకే విజయ్ ది ఎంజీఆర్, ఎన్టీఆర్ లను మించింన విజయం.. రజనీకాంత్

Publish Date:May 18, 2026

Advertisement

ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో  ఘన విజయం సాధించిన తమిళ స్టార్ హీరో , టీవీకే అధినేత విజయ్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన విజయ్ విజయం చారిత్రాత్మకంగా అభివర్ణించారు. 

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో   విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుతమైన విజయంతో అధికారాన్ని దక్కించుకున్న సంగతి విదితమే. అయితే ఆ విజయం తరువాత తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారి తీసింది. ఎన్నికలలో పరాజయం పాలైన డీఎంకే అధినేత స్టాలిన్ నివాసానికి వెళ్లి మరీ పలకరించి, పరామర్శించిన రజనీకాంత్, ఘన విజయం సాధించిన టీవీకే విజయ్ కు అభినందించలేదు. మరో పక్క.. కమల్ హసన్ స్వయంగా విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. కానీ రజనీకాంత్ మాత్రం విజయ్ కు మర్యాదపూర్వకంగా కలవకపోవడం, కనీసం అభినందనలు తెలియజేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.  రజనీకాంత్ అసూయతో విజయ్‌ను అభినందించలేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలు మరియు అసూయ వార్తలపై రజనీకాంత్  స్పందించారు.

 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు, తమిళనాడులోని రెండు ప్రధాన ద్రావిడ పార్టీలను ఒంటరిగా ఎదుర్కొని విజయ్ ఈ ఘన విజయాన్ని సాధించారంటూ మీడియా ఎదుట విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ సాధించిన విజయాల కంటే విజయ్ సాధించిన విజయం ఎంతో గొప్పదన్నారు. విజయ్ విజయం సాధించడం, ముఖ్యమంత్రి కావడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదనీ, రాజకీయాలకు దూరమై చాలా కాలమైందని చెప్పారు. ఇక విజయ్ పై తాను అసూయ చెందుతున్నానని వస్తున్న వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేసిన రజనీకాంత్, తమ ఇద్దరి మధ్యా పాతికేళ్లకు పైన వయస్సు తూడా ఉందని గుర్తు చేశారు.  యువకుడైన విజయ్, రాజకీయాలకు అతీతంగా   స్వయంకృషితో, సొంత బలంతో రెండు పెద్ద పార్టీలను ఎదిరించి ఈ గుర్తింపు తెచ్చుకున్నాడని  ప్రశంసించారు.

ఇక స్టాలిన్‌ను కలవడంపై వస్తున్న విమర్శలకు కూడా రజనీకాంత్ సమాధానం చెప్పారు. స్టాలిన్ తో తన స్నేహం రాజకీయాలకు సంబంధించినది కాదన్నారు.  కొలత్తూరులో స్టాలిన్ పరాజయం పాలు కావడం తనను ఎంతగానో బాధించిందని, అందుకే స్నేహపూర్వకంగా ఆయన్ను పరామర్శిం చానన్నారు.   ముఖ్యమంత్రిగా విజయ్ విజయం సాధించిన వెంటనే తాను ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేశానని, ఇందులో దాచడానికి ఏమీ లేదన్న రజనీకాంత్..  ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో తమిళనాడు  ప్రగతి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

By
en-us Political News

  
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇమామ్‌లు, ముయెజ్జిన్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనాలను ప్రకటించారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రవేశపెట్టిన ఈ విధానాలన్నింటికీ ప్రస్తుత సువేందు సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టేసింది.
గతంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో విడదల రజినితో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకుడు పిల్లి కోటి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వివాదానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే న్యాయస్థానం విడదల రజినిని పాస్ పోర్టు సరెండర్ చేయాల్సిందిగా ఆదేశించింది.
నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి హాజరు కావడం మాత్రమే కాకుండా ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత వేదికపైకి వెళ్లి కొత్త ముఖ్యమంత్రిని అభినందించడం ప్రస్తుత కాలంలో అత్యంత అరుదనే చెప్పాలి. ఆ ఆరుదైన సంఘటన కేరళం ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సోమవారం జరిగింది.
విద్యాసంవత్సరం ఆరంభాన్ని ఓ భారీ విద్యాపండుగగా నిర్వహించేందుకు సమాయత్తమౌతోంది. ఆ రోజు అంటే రానున్న విద్యాసంవత్సరం మొదటి రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లోనూ ఏకకాలంలో మూడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అవేంటంటే అదే రోజున తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాలో జమచేయనుంది. అలాగే అదే రోజు అంటే పాఠశాలలె తెరిచిన తొలి రోజునే విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రిని అందించనుంది. అలాగే అదే రోజు మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ నూ నిర్వహించనుంది.
అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో రంగంలోకి దిగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈస్ట్ తిరుచ్చి నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో విజయ్ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
తాను సమాజంలో ఉన్న అసమానతలకు, కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమన్నారు.  దేవాలయాల పూజా విధానాలపై కానీ, ప్రజల మత స్వేచ్ఛపై కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. 
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, తెలుగుదేశం పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నాయకుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. సాధారణంగా అవకాశం ఉన్నా లేకున్నా టీడీపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకునే భూమన.. ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను ఎక్కి ప్రయాణించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తదుపరి విచారణలో ఈ పిటిషన్‌పై తుది తీర్పును వెల్లడిస్తామని పేర్కొన్న హైకోర్టు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.