గీత దాటుతున్న టీవీకే ఎమ్మెల్యేలు: సీఎం విజయ్ ఏం చేస్తున్నారు.!

Publish Date:Nov 11, 2026

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ తనదైన ముద్ర వేస్తూ తొలి ప్రయత్నంలోనే తన టీవీకే పార్టీని గెలిపించుకుని, తొలి ప్రయత్నంలోనే  ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి సుమారు 35 శాతానికి పైగా ఓటు బ్యాంకును సాధించారు.

విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇటీవల కాలంలో టీవీకే ప్రభుత్వానికి చెందిన కొందరు నేతల వివాదాస్పద ప్రవర్తన పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తోంది. గతంలో ఒక మంత్రి డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వివాదంలో చిక్కుకోగా, తాజాగా తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్,  సిట్టింగ్ ఎమ్మెల్యే రవిశంకర్ దురుసు ప్రవర్తన వివాదంగా మారింది.

తిరుచిరాపల్లి జిల్లాలో తమ ప్రాంతంలోని తాగునీటి ఎద్దడి, చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్లిన కార్తీక్ కుమార్ అనే  వ్యక్తిపై డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ భౌతిక దాడికి దిగారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి తన వద్దకు వచ్చిన వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకోవడం  దుమారానికి దారితీసింది.

ఇది కూడా చదవండి: చంద్రబాబుతో భేటీ: విజయ్ విక్టరీ సింబల్.. దక్షిణాది పొలిటికల్ సినేరియో మార్పునకు సంకేతమా.?

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో టీవీకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో హింసాత్మక మరియు ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి పలకాలని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేల తీరు ఆయన ఆశయాలకు గండికొడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం కొద్ది నెలలు మాత్రమే అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి విజయ్, తప్పు చేసే ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుని గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.

ముఖ్యమంత్రిగా విజయ్ పని తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో చూపుతున్న వేగం, నిరాడంబరత ప్రజలను ఆకట్టుకుంటున్నప్పటికీ, టీవీకే ఎమ్మెల్యేల తీరు, వారిపై వెల్లువెత్తుతున్న విమర్శలు పార్టీకే కాదు, వ్యక్తిగతంగా విజయ్ కూడా నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గీత దాటిన ఎమ్మెల్యేలపై విజయ్ కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. 

మీకు నచ్చవచ్చు:  తమిళనాడు సీఎం విజయ్ పై ఎన్నికల కేసు: ఈ నెల 14న తీర్పు.!

విడాకుల కేసు: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్ వైఫ్.!

[TVK MLAS Crossing Line, Tamilnadu Government, CM Vijay, Deputy Speaker Ravi Shankar,  Controversy, Telugu One]

By
en-us Political News

  
తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యురాలు సోనియా గాంధీ రాసిన సంచలన ఆత్మకథ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ప్రస్తుత ఆధునిక కాలంలో ఉపాధి అవకాశాల రూపురేఖలు వేగంగా మారుతున్నాయి.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉన్నట్లు సృష్టించారు.. జీతం రాకపోయినా వేలల్లో జీతం అందుతున్నట్లు నకిలీ పే స్లిప్పులు తయారు చేశారు.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ పోలీసు వ్యవస్థలోకి మరో కొత్త తరం అడుగుపెట్టింది.
ప్రధాని కావాలనుకోవడం తప్పా.. ప్రణబ్ కుమార్తె కౌంటర్.! 
ఉద్యోగం.. మంచి జీతం.. ఉచిత వసతి.. ఇవన్నీ ఆశ చూపించి యువతులను హైదరాబాద్‌కు రప్పించడం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.