సొంత గూటివైపు కీలక నేతలు! ఆ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లేనా?

Publish Date:Nov 18, 2020

Advertisement

తెలంగాణలో టీడీపీకి మంచి రోజులు రాబోతున్నాయా? గతంలో చక్రం తిప్పిన నేతలు తిరిగి సొంత గూటికి రాబోతున్నారా? సీఎం కేసీఆర్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు?. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. గతంలో తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీకి పునర్ వైభవం రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఓ వెలుగు వెలిగి.. ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలు టీడీపీలోకి రాబోతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే టీటీడీపీకి మళ్లీ బలమైన శక్తిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

ఖమ్మం జిల్లా నుంచే రాజకీయ పెను మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మాజీ మంత్రి , గతంలో టీడీపీలో కీలక నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తిరిగి సొంత గూటికే వస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తన అనుచరులతో ఆయన చర్చలు కూడా జరుపుతున్నారని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ ఫస్ట్ టర్మ్ లో మంత్రిగా పనిచేశారు తుమ్మల, అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాలేరులో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఆయన సైలెంట్ గానే ఉన్నారు. 

 

తుమ్మలపై గెలిచిన ఉపేందర్ రెడ్డి కూడా కొన్ని రోజుల తర్వాత కారు పార్టీలో చేరారు. ఉపేందర్ రెడ్డి చేరికతో నియోజకవర్గంలో తుమ్మల హవా పూర్తిగా తగ్గిందని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, అధికార యంత్రాంగంమంతా ఉపేందర్ రెడ్జి డైరెక్షన్ లోకి వెళ్లిపోయాయి. పార్టీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన ప్రాధాన్యం తగ్గడంతో తుమ్మల మరింత సైలెంట్ అయిపోయారు. తుమ్మ‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌డం ఇబ్బంది మారడంతో చాలా వ‌ర‌కు ఆయన ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. కొన్ని రోజులుగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. టీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదని తుమ్మల అనుచరులు చెబుతున్నారు. 

టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న తుమ్మల పార్టీ మారుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ ముఖ్యనేతలు ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించారని చెబుతున్నారు. అయితే తుమ్మల మాత్రం బీజేపీలోకి వెళ్లేకంటే టీడీపీలో చేరితే బెటరని భావిస్తున్నారనే చర్చ ఖమ్మం జిల్లాలో జరుగుతోంది. టీడీపీకి తెలంగాణలో బలమైన కేడర్ ఉందని.. సరైన లీడర్ వస్తే వారంతా యాక్టివ్ అవుతున్నారని తుమ్మల భావిస్తున్నారని చెబుతున్నారు. తుమ్మల టీటీడీపీ పగ్గాలు చేపడితే.. గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం ఇతర పార్టీల్లోనే ఉన్న నేతలంతా తిరిగి సొంత గూటికి వస్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. గ‌తంలో తెలంగాణ టీడీపీలో ప‌నిచేసి..ఇప్పుడు రాజ‌కీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న నేత‌ల‌ను కూడ‌గ‌ట్టే బాధ్య‌త‌ను జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు మాజీమంత్రి తుమ్మ‌ల‌కు అప్ప‌గించ‌బోతున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. గ‌తంలో తుమ్మ‌ల‌కు చంద్ర‌బాబు ఇచ్చిన ప్రియారిటీని సైతం వారు గుర్తు చేస్తున్నారు. 

 

తుమ్మల నాగేశ్వరరావు కదలికలను గమనిస్తున్న సీఎం కేసీఆర్.. ఆయన పార్టీ మారతారనే ప్రచారంతో అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇటీవల రైతు వేదిక ప్రారంభోత్సవం కోసం ఇద్దరు మంత్రులు తుమ్మల ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం వచ్చిన మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డిలు.. తుమ్మల ఇంటికెళ్లారు. ఇద్దరు మంత్రులు దగ్గరుండి ఆయన్ను రైతు వేదిక ప్రారంభోత్సానికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే అజయ్, నిరంజన్ రెడ్డిలు తుమ్మల ఇంటికి వచ్చారనే చర్చ జరుగుతోంది. పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలని తుమ్మలను కేసీఆర్ మంత్రుల ద్వారా బుజ్జగించినట్లు చెబుతున్నారు. ఇంతకాలం తుమ్మలను పట్టించుకోని కేసీఆర్.. ఆయన పార్టీ మారుతారనే ప్రచారంతో టెన్షన్ పడుతున్నారని సమాచారం. అందుకే ఇద్దరు మంత్రులను రాయబారానికి పంపారని చెబుతున్నారు.

 

సీఎం కేసీఆర్ ఇద్దరు మంత్రులను తుమ్మల ఇంటికే పంపారంటనే ఆయన పవర్ ఏంటో తెలుసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ బలపడితే టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టే గులాబీ బాస్ గుబులు పడుతున్నారని వారు అంటున్నారు. తుమ్మల గనక టీడీపీలోకి వస్తే తెలంగాణ రాజకీయ సమీకరణలు భారీగా మారిపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే తుమ్మ‌ల మాత్రం తనపై జరుగుతున్న ప్రచారంపై మౌనం వీడ‌టం లేదు. అయితే టీఆర్ఎస్ పార్టీ గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా ఆయ‌న దూరంగా ఉంటున్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి తుమ్మ‌ల ఎలాంటి రాజకీయ నిర్ణ‌యం తీసుకుంటారన్నదానిపై మాత్రం జనాల్లో ఆసక్తి పెరుగుతోంది.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.