కేసీఆర్ కు రేవంత్ బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి తుమ్మల? 

Publish Date:Aug 31, 2021

Advertisement

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందా? కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణమాలు, అధికార పార్టీ నేతల కదలికలను బట్టి.. త్వరలో కారుకు ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. రేవంత్ ఆపరేషన్ అనుకున్నదానికంటే సక్సెస్ అవుతుందని, త్వరలోనే కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారని గాంధీభవన్ వర్గాలు ఖచ్చితంగా చెబుతున్నారు. 

విప్లవాల గడ్డ ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచే రేవంత్ రెడ్డి యాక్షన్ మొదలుపెట్టారట. రేవంత్ ఆపరేషన్ సక్సెస్ కావడంతో .. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా జిల్లాను శాసించిన తుమ్మల.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయ్యారు. పాలేరులో తుమ్మలపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల మరింత బలహీనమయ్యారు. నియోజకవర్గంలో తుమ్మల ప్రాబల్యం తగ్గించేందుకు ఉపేందర్ రెడ్డి ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా మంత్రి పువ్వాడ కూడా తుమ్మలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ తీరుపై కొన్ని రోజులుగా తుమ్మల గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సమావేశాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. 

మరోవైపు జిల్లాలో అధికారపార్టీ పై అసమ్మతి పెరుగుతుండటం, ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ కనిపించడంతో..  తుమ్మల నాగేశ్వరరావు  కూడా కాంగ్రెస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తుమ్మలతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని, ఆయన కూడా అంగీకరించారని చెబుతున్నారు. త్వరలోనే అధికారికంగా తుమ్మల తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పాలేరులో జరిగిన ఓ సభలో మాట్లాడిన తుమ్మల తనయుడు.. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తీరుపైనా విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోవడం వల్లే తుమ్మల తనయుడు ఆ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.  

టీడీపీ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖమ్మంలో పోటీ చేసిన తుమ్మల పువ్వాడ అజయ్ పై ఓడిపోయారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పట్టున్న తుమ్మలను టీఆర్ఎస్‌లోకి పిలిచి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని అప్పజెప్పారు. అనంతరం మంత్రిగా జిల్లా అభివృద్ధిలో క్రియాశీలక పాత్రపోషిస్తూ జిల్లాకు సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులు తెచ్చిపెట్టారు. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం పాలేరుకు జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు తుమ్మల నాగేశ్వరరావు. అయితే 2018 ఎన్నికల్లో రాష్ట్రమంతా కారు హవా వీచినా.. పాలేరులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తరువాత పార్టీలో కూడా తన స్థాయికి తగ్గ గుర్తింపు లేకపోవడంతో ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు తుమ్మల. 

మళ్ళీ పాలేరు నుండి నిలబడ్డ ఆయన ఓటమి పాలవడం నాటినుంచి నేటి వరకు సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయన పార్టీ మారుతారు అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తుమ్మల కాంగ్రెస్ లో చేరితో ఖమ్మం జిల్లాలో కారు స్పీడ్ కు బ్రేకులు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.