రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుంది : తలసాని

Publish Date:Jul 2, 2026

Advertisement

 

కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసింది. చేసిన అప్పులతో ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పని కూడా చేయలేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ అద్భుతమైన అభివృద్ధి చేశారని అన్నారు.

అధికార పార్టీ నాయకులు బూతులు మాట్లాడితే కేసులు నమోదు కావడం లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్న తమపై మాత్రం కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ వ్యవస్థలు శాశ్వతమని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు, ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం లేదని ఆరోపించారు. మంత్రుల ఆహ్వానం మేరకే హరీశ్ రావు గన్‌పార్క్‌కు బయలుదేరారని, అలాంటి పరిస్థితిలో ఆయనను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రులకు ధైర్యం ఉంటే కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌కు రావాలని సవాల్ విసిరారు. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సతీమణి లక్ష్మీభాయిని లూప్ లైన్ పోస్టుకు బదిలీ చేశారని ఆరోపించారు. ఇది ప్రభుత్వం నడుస్తుందా, సర్కస్ నడుస్తుందా అన్న సందేహం కలుగుతోందని, ప్రభుత్వం సర్కస్ కంపెనీలా వ్యవహరిస్తూ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. సవాళ్లు విసిరిన మంత్రులు చివరికి పిరికిపందల్లా వెనక్కి తగ్గారని అన్నారు.

By
en-us Political News

  
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
టీచర్లకూ మధ్యాహ్న భోజనం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లలో కీలక మార్పులు చేపట్టింది.
పోస్టాఫీసు నుంచి స్పీడ్ పోస్ట్‌లో వచ్చే పార్శిల్‌లో మందులు ఉంటాయని భావిస్తారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివార్లలో గురువారం తెల్లవారుజామున ఒక ఊహించని ఘోర విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌తో పాటు తబ్రేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
శ్రీకాకుళం తీరప్రాంతంలో అపారంగా లభ్యమవుతున్న బీచ్ శాండ్ మరియు హెవీ మినరల్స్ (భారీ ఖనిజాలు) ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చగల సత్తా ఉన్న అంశాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.