తెలంగాణలో ‘తెలుగు’ జెండా పీకేసినట్లే!

Publish Date:Oct 15, 2020

Advertisement

రమణపై తమ్ముళ్ల తిరుగుబాటు

 

బాబుపై మరోసారి లేఖాస్త్రం

 

ఆర్ధిక పరిస్థితులే అసలు సమస్యట

 

తెలంగాణ గడ్డపై కళ్లు తెరచిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు అదే తెలంగాణలో కన్నుమూసే విషాదకర పరిస్థితికి చేరింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా పూర్తిగా పీకేసినట్లుగానే కనిపిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణలో పార్టీని అనాధను చేశారన్న ఆగ్రహం, ఎన్టీఆర్ కాలం నుంచి కొనసాగుతున్న తమ్ముళ్లలో కట్టలు తెంచుకుంటోంది. ఓటుకు నోటు కేసు తర్వాత, తమ అధినేత.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయపడి పార్టీని వదిలేసి పోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రనేతలంతా ఎవరి దారి వారు చూసుకుని వెళ్లిపోగా, ఉన్న వారి భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ అసమర్థ నాయకత్వం పుణ్యాన, కొస ప్రాణంతో ఉన్న పార్టీ.. పూర్తిగా సమాధి కావడానికి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కాలయాపన విధానమే కారణమని తమ్ముళ్లు ధ్వజమెత్తుతున్నారు.

 

తాజాగా.. రమణను మార్చాలని తెలంగాణ టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నేతలు మరోసారి చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించారు. ఈ విధంగా టీటీడీపీ నేతలు బాబుకు లేఖ రాయడం ఇది రెండోసారి. మంగళవారమే వారు తమ లేఖను బాబుకు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఎవరినీ కలవడం లేదని సిబ్బంది చెప్పడంతో, లేఖను ఆయన పీఏకు ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ సంస్థాగత విషయాలు చర్చించాలని వారంతా లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి అటు రమణకు సైతం పార్టీ కార్యాలయంలో సిబ్బంది ముందు ఇబ్బందికరంగా మారింది.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో అన్ని పార్టీలు తమ అభ్యర్ధిని ప్రకటించి, ఆ మేరకు ప్రచారంలో ఉన్నాయి. కానీ తమ పార్టీ మాత్రం ఇంతవరకూ అభ్యర్ధిని ప్రకటించలేదని తమ్ముళ్లు, రమణపై మండిపడుతున్నారు. అటు ఆరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలపైనా, రమణ ఇప్పటిదాకా చర్చించలేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందా? లేదా అన్న దానిపైనా స్పష్టత ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు.

 

ఈ విషయంలో రమణ చెబుతున్న దానికీ, చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకూ పొంతన ఉండటం లేదంటున్నారు. ఏ నిర్ణయమయినా చంద్రబాబును అడిగే తీసుకుంటానని రమణ, పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం.. తెలంగాణకు సంబంధించిన వ్యవహారాల్లో, మీరే సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ నేతలకు చెబుతున్నారు. ప్రతి దానికీ నా నిర్ణయం కోసం ఎదురుచూడవద్దని, మీరే నిర్ణయం తీసుకోమని స్పష్టం చేస్తున్నారు. దీనితో ఎవరి మాట నమ్మాలో అర్ధం కావడం లేదని నేతలు వాపోతున్నారు. లాక్‌డౌన్ మొదలయినప్పటి నుంచీ, బాబు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అయినా, ఒక్కసారి కూడా తమతో భేటీ కాలేదని తమ్ముళ్లు చెబుతున్నారు.

 

అయితే ఈ విషయంలో పార్టీ నాయకత్వం.. కావాలనే తప్పించుకు తిరిగే ధోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు, సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచే పరిస్థితి ఉండదు కాబట్టి, పోటీ చేసి డబ్బులు ఖర్చు చేయడం ఎందుకన్న ఆలోచనతో, నాయకత్వం ఉన్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ నాయకత్వం ఆంధ్రాలోనే డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేనందున, ఇక తెలంగాణలో ఖర్చు పెడుతుందనుకోవడం అత్యాశేనంటున్నారు.

 

‘ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో కూడా పార్టీ నయాపైసా ఇచ్చే అవకాశం లేదు. ఇక్కడ పార్టీపై మా సార్‌కు ఆసక్తి లేదు. నిజంగా ఆసక్తి, పట్టుదల ఉంటే రెండు నెలల ముందునుంచే ఎన్నికలపై దృష్టి పెట్టేవారు. ఆయన ఎన్నికల సమయంలో ఎంత వేగంగా పనిచేస్తారో, ఎంత వేగంగా ఆలోచిస్తారో మేం చూశాం కదా? ఇప్పుడు ఏం చేయాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలి. అదే గతం మాదిరిగా అన్ని వ్యవహారాలు బాబు చేతిలో ఉంటే, ఇప్పటి పరిస్థితి వేరుగా ఉండేది. సర్వే సంస్థలను ఎన్నికలకు మూడు నెలల ముందే దించేవారు.పరిశీలకుల హడావిడి, నాయకుల మీడియా సమావేశాలు ఉండేవి. అంటే దీన్నిబట్టి రెండు విషయాలు అర్ధమవుతున్నాయి. ఒకటి ఆయనకు తెలంగాణలో ఎన్నికలపై ఆసక్తి లేకపోయినా ఉండాలి. లేదా ఆర్ధికపరమైన నిర్ణయాలు ఆయన చేతిలో లేకపోయినా ఉండాలి. ఇప్పుడు ఈ కీలకమైన వ్యవహారాలన్నీ సారు చూడటం లేదంటున్నారు. గాలి వచ్చినప్పుడే గెలుస్తామన్న ధోరణి కనిపిస్తోంద’ని ఓ కీలక నేత వ్యాఖ్యానించారు.

 

రమణను తొలగించాలని నేతలంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నా, బాబు స్పందించకపోలడంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బహుశా మిగిలిన వారికి పగ్గాలు అప్పగిస్తే.. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారన్న భయంతోనే, నిర్ణయాన్ని నానుస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘మా సార్ కు బలమైన బీసీ కులానికి చెందిన నాయకుడు కావాలి. కానీ అతడు బలంగా ఉండకూడదు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా, తనపైనే ఆధారపడే నాయకుడు కావాలి. ఈ అర్హతలున్న నాయకుడి కోసమే, మా సార్ కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం లేదనిపిస్తోంద’ని ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

 

కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి వంటి సీనియర్లలో ఒకరికి, అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్న సూచన చాలాకాలం నుంచీ వినిపిస్తోంది. ఓసీలకు ఇవ్వాలనుకుంటే దయాకర్‌రెడ్డి, రావులలో ఒకరికి ఇవ్వడం మంచిదని, బీసీలకు ఇవ్వాలనుకుంటే అరవిందకుమార్ గౌడ్‌కు ఇవ్వడం ఉత్తమమంటున్నారు. అదేవిధంగా ప్రత్యర్ధులపై విరుకుపడే నోరున్న న ర్శిరెడ్డి లాంటి నేతకు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే మంచిదని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా, వారు సొంత ఖర్చులతోనే పార్టీ నడిపించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాగా దుబ్బాక ఉప ఎన్నికలో రమణను, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్శిరెడ్డి లేదా కాట్రగడ్డ ప్రసూనను రంగంలోకి దింపాలన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో?

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.