తిరుమల కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల విక్రయానికి టీటీడీ అనుమతి?

Publish Date:Apr 8, 2025

Advertisement

తిరుమల కొండపై ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం. ఆఖరికి ప్లాస్టిక్ బాటిళ్లకు కూడా అనుమతి లేదు. అయితే ఈ నిషేధాన్ని అడ్డుపెట్టుకుని గాజు వాటర్ బాటిళ్ల రూపంలో భక్తులను దోచుకుంటున్నారు వ్యాపారులు. గత వైసీపీ హయాంలో కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న అధికారులు ఆ నిషేధాన్ని కేవలం ప్లాస్టిక్ బాటిళ్ల విషయంలో మాత్రమే కఠినంగా అమలు చేశారు. అలా ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించి, వాటి స్థానంలో వైసీపీ నాయకులకు ప్రయోజనం చేకూరేలా గాజు వాటర్ బాటిళ్లను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.  

ఈ గాజు వాటర్ బాటిల్లను తయారు చేసే అనుమతులను  అప్పట్లో వైసీపీ నేతల బినామీలకే ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. అప్పటినుండి ఇప్పటివరకు తిరుమల కొండపై గాజు వాటర్ బాటిల్ల విక్రయం పేరుతో వైసీపీ నేతలు కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. మరొకరికి అవకాశం లేకుండా వైసిపి నేతలు వాటర్ బాటిల్ల పేరుతో ఒక  పేద్దమాఫియానే నడుపుతున్నారన్న విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి కొండపై  ప్లాస్టిక్ వాడకం నిషేధం విషయంలో అప్పటి వైసీపీ సర్కార్ కు చిత్తశుద్ధి ఉండి ఉంటే.. కేవలం ప్లాస్టిక్ బాటిళ్లనే కాకుండా, ప్లాస్టిక్ కవర్లు, బొమ్మలకు వేసే ప్లాస్టిక్ కవర్లు కూడా నిషేధించాలి. కానీ అలా చేయకుండా కేవలం తమ వారికి అంటే తమ పార్టీ నేతలకు ప్రయోజనం కలిగే విధంగా కేవలం వాటర్ బాటిళ్లపైనే నిషేధం విధించి, వాటి స్థానంలో గాజు బాటిళ్లను తీసుకువచ్చింది. ఈ గాజు నీళ్ల సీసాలతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   గాజు సీసాల వినియోగం, వాటి ధరతో ఇబ్బందులు పడుతున్నారు.

ఉత్సవాల సమ యంలో ఎడా పెడా ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగి స్తూనే నిబంధనల పేరుతో భక్తులపై భారం మోపడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తుల సౌలభ్యం కోసం ప్లాస్టిక్ బాటిళ్లకు అనుమతి ఇవ్వాలని టీటీడీ యోచిస్తున్నది . బిస్లరీ, కిన్లే, ఆక్వా ఫినా, టాటా ప్లస్, తదితర బ్రాండెడ్ సంస్థలకు వారు విక్రయించే మినరల్ వాటర్ బాటిళ్లకు అనుమతినిస్తూ, దాంతో పాటుగా కొండపై పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఏ సంస్థలైతే తాగి వాడి పడేసే వాటర్ ప్లాస్టిక్ బాటిల్లను అక్కడికక్కడే నాశనం చేసేలా క్రషింగ్ యంత్రాలను కూడా ఎవరైతే ఏర్పాటు చేస్తారో వారికే బాటిల్స్ విక్రయ అనుమతులను కూడా మంజూరు చేయాలని షరతును విధించాలని భావిస్తున్నారు. ఈ క్రషింగ్ యంత్రాలను మెయింటెనెన్స్ కూడా సంబంధిత సంస్థలే చేపట్టేలా నిబంధనలు విధించాలని టీటీడీ భావిస్తోంది.  

By
en-us Political News

  
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.