టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు
Publish Date:Jul 22, 2025

Advertisement
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో శ్యామలరావు మీడియాకు తెలిపారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా పరిపాలనా భవనం నిర్మాణం చేయాలని, .తిరుమలలో మూడో క్యూకాంప్లెక్స్ నిర్మాణ అవసరంపై చర్చించి, నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం కమిటీ, తిరుమల ఆలయాల నిర్మాణాలపై విధివిధానాలపై అధ్యయనానికి సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధి, శ్రీవారి సేవలో ప్రొఫెషనల్స్ వినియోగానికి ఆమోదం, సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ క్రైమ్ లాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యం నిర్వహణ మరింత మెరుగుకు చర్యలు, ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయంలో అన్నప్రసాదాల కోసం కోసం రూ. 3.45 కోట్లు కేటాయించాలని, కడపలో పురాతన శివాలయం జీర్ణోద్ధరణకు తీర్మానం చేశామని చెప్పారు. 600 మంది వేదపారాయణదారులకు సంభావన కోసం రూ. 2.16 కోట్లు , 142 మంది డ్రైవర్ల క్రమబద్దీకరణ, శ్రీవాణి నిధులతో భజన మందిరాల నిర్మాణాలకు అనుమతినిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/ttd-key-decisions-25-202491.html












