Publish Date:Apr 27, 2026
మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Publish Date:Apr 27, 2026
15 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటి.
Publish Date:Apr 27, 2026
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 50 మందితో కూడిన ప్రత్యేక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ శాఖ సిబ్బందితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం, అగ్నిమాపక దళం సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలను అదుపు చేశారు.
Publish Date:Apr 26, 2026
రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు.
Publish Date:Apr 26, 2026
కేవలం భౌతిక సరిహద్దులే కాకుండా.. సమాచారం, సాంకేతికత, సామాజిక సంబంధాల చుట్టూ కూడా నాలుగు అంచల నియంత్రణ వ్యవస్థను బీజింగ్ సిద్ధం చేస్తోంది.
Publish Date:Apr 26, 2026
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా బంతిని ఆపే క్రమంలో 15 ఏళ్ల వైభవ్ గాయంతో మైదానాన్ని వీడాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జోరు మామూలుగా లేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 15 ఏళ్ల వయసులో రికార్డుల మోత మోగిస్తూ.. క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడటం జట్టుతో పాటు అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది.
Publish Date:Apr 26, 2026
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందనీఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దనీ అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. పెరిగిన తేమ కారణంగా ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుందనీ వాతావరణ శాఖ హెచ్చరించింది.
Publish Date:Apr 26, 2026
కేవలం కొన్ని ప్రధాన బంకుల్లో మాత్రమే ఇంధనం లభిస్తుండటంతో, అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. తిరుమలలోని హెచ్పి పెట్రోల్ బంక్ పెట్రోల్, డీజిల్ కోసం భారీగా వాహనాలు బారులు తీరాయి.
Publish Date:Apr 26, 2026
అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు తమ ఆర్థిక అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనీ, . లగ్జరీ కార్లు, విలువైన బంగారం, ఫ్లాట్లు వంటివి ధర్మేంద్రతోనే కొనుగోలు చేయించి అన్షురెడ్డి పేరిట రిజిస్టర్ చేయించుకున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Publish Date:Apr 26, 2026
గత ఆరు నెలలుగా తాను నార్సింగి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని పేర్కొంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఐ వెసులుబాటు కల్పిస్తున్నా రని ఆరోపించింది.
Publish Date:Apr 26, 2026
చట్టం బలంగా ఉంటుంది. అయితే సమస్య ఏమిటంటే దాని అమలు మాత్రం అత్యంత బలహీనం. కష్టంగా ఉన్నా ఇదే చేదు నిజం. చట్టానికి, సమాజానికి మధ్య అగాధం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసేదిగా పరిణమిస్తోంది. దేశంలో చట్టాలు ఐడిలిస్టిక్ కోణంలో రూపొందుతాయి తప్ప.. రియలిస్టిక్ గా కాదు అన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది.
Publish Date:Apr 26, 2026
జగన్ తన ఫారిన్ టూర్ కోసం ఇప్పటికే ఇప్పటికే న్యాయస్థానం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ పొందిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నందున జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పని సరి అన్న సంగతి విదితమే. అది పక్కన పెడితే.. ఈ పర్యటనలో భాగంగా జగన్, ఆయన సతీమణి భారతీ లండన్ లండన్‌లో ఉంటున్న తన కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలను కలుసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని సమాచారం.
Publish Date:Apr 26, 2026
తప్పుడు కేసుల వల్ల తాను ఐదేళ్ల పాటు ఎదుర్కొన్న మానసిక వేదన, ఆర్థిక నష్టం, సామాజికంగా ఎదురైన అవమానాలకు గాను రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవస్థను అడ్డం పెట్టుకుని తనను లక్ష్యంగా చేసుకున్న అధికారులు తమ సొంత జేబుల నుంచే ఈ పరిహారం చెల్లించాలన్నారు. ఇది భవిష్యత్తులో ఏ అధికారి కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తోటి అధికారులపై తప్పుడు కుట్రలు చేయకుండా గుణపాఠంగా ఉండాలని పేర్కొన్నారు.