టీటీడీ పాలక మండలి చైర్మన్ ని దింపడానికి వైసీపీకి ఎందుకంత ఆతృత? ఎందుకంత ఉత్సుకత? పదే పదే రాజీనామా చేయమని ఎందుకు చేస్తారు? తాజాగా చైర్మన్ బీఆర్ నాయుడుపై ఏఐ వీడియోలతోనూ చేసిన ప్రయోగంలో మతలబు ఏంటి? అసలింతకీ వైసీపీ చేసిన ఏఐ జనరేటెడ్ వీడియోలలో ఎముంది? టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్టు ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంతే కాదు.. కొన్ని ఉదాహరణలు ఏకరవు పెట్టారు. అందులో భాగంగా చూస్తే గతంలో టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేసిన వారంతా కూడా రిజైన్ చేశారనీ.. మీరు కూడా అలా చేయక తప్పదనీ భూమన అన్నారు. తిరుమల కొండ మీద గాలి కూడా పవిత్రంగా ఉండాల్సిందే అని పీవీ నరసింహరావు అన్నట్టు.. ఇక్కడొక శాసనం ఉందంటారు భూమన. ఎవరైతే అనైతిక కార్యకలాపాలకు పాల్పడతారో వారు తమకు తాము తొలగిపోవల్సిందే నన్నారు. అందుకు ఎస్వీబీసీ చైర్మన్ గా పృధ్వి ఉదంతాన్ని ఉదహరించారు. పృధ్వి ఆడియో లీక్ కాగానే జగన్ ఆయన్ను తప్పించారని గుర్తు చేశారు. ఆ తర్వాత సిర్రి అప్పన్ అనే అర్చకుడు అనైతికంగా వ్యవహరిస్తే వెంటనే తొలగించారు. ఇంకా చదలవాడ, పుట్టా వంటి వారు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే టీటీడీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ ఉదాహరణలన్నీ చెబుతూ.. బీఆర్ నాయుడు రిజైన్ చేయాలనీ, లేకుంటే చంద్రబాబు ఆయనను తొలగించాలనీ భూమన డిమాండ్ చేశారు.
అయితే భూమనకు గట్టికౌంటర్ ఇచ్చారు బీఆర్ నాయుడు. వీరి బండారమంతా తానెక్కడ బయట పెడతానో అన్న భయంతోనే భూమన ఇదంతా చేస్తున్నట్లు ఆరోపించిన బీఆర్ నాయుడు... వీరు గతంలో టీటీడీ కేంద్రంగా చేసిన దురాగతాలన్నిటికీ సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. అవన్నీ త్వరలోనే బయటకొస్తాయని హెచ్చరించారు బీఆర్ నాయుడు. తానింత వరకూ ఆగుతూ రావడానికి గల కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం వల్లే అన్నారు బీఆర్. భూమనలాంటి వారు దిగిపోమంటే దిగిపోవడానికి కాదు తానున్నదన్నారు.
తిరుమల ఉన్న ప్రాంతం నుంచే తాను వచ్చాననీ.. అదే భూమన తిరుపతికి పక్క జిల్లా నుంచి వచ్చినట్టు చెప్పారు బీఆర్ నాయుడు. అసలా వీడియోలో కనిపిస్తున్న మహిళ కుటుంబంతో తమకు ఎప్పటి నుంచో కుటుంబ సంబంధ బాంధవ్యాలున్నట్టు చెప్పారాయన. అంతే కాదు అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారు. ఇందులో తన పరువు తీసే కుట్ర దాగి ఉందన్న బీఆర్ నాయుడు.. తనతో పాటు టీటీడీ ప్రతిష్ట మంటగలిపే యత్నం ఉందని ఆరోపించారు. అందుకే తాను సైబర్ క్రైమ్ ని ఆశ్రయించానన్నారు. వీరిపై వంద కోట్ల పరువు నష్టం దావా వేసి.. జీవితాంతం ఈ బీఆర్ నాయుడు పేరు గుర్తుండిపోయేలా చేస్తానన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ttd-chairman-versus-formerchairman-39-214849.html
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.