టీటీడీ ట్రస్టుల దాతలకు కొత్త నిబంధనలు..!

Publish Date:Jul 14, 2026

Advertisement

 

టీటీడీలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్  బీఆర్ నాయుడు తెలిపారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశం అనంతరం, ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, ఏకరీతి తీసుకురావాలనే ఉద్దేశంతో టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్‌లో మార్పులు చేపట్టినట్లు చెప్పారు. ఈ కొత్త నిబంధనలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అయితే, ఇప్పటికే విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:

రూ.6.31 కోట్లతో తిరుమలలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు కలిగిన భక్తులు వేచి ఉండేందుకు ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి టెండర్లకు ఆమోదం. 

కుమారధార, పసుపుధార డ్యామ్‌ల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి రూ.2.77 కోట్ల మంజూరుకు ఆమోదం. 

గ్రీన్ ఎనర్జీ అభివృద్ధిలో భాగంగా జీఎన్‌సీ సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్‌ను విష్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ విరాళంగా ఏర్పాటు చేసి, టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి ఆమోదం.

తిరుమల ఎస్వీ మ్యూజియంలో 12 ఏళ్లు పైబడిన సందర్శకులకు జీఎస్‌టితో కలిపి రూ.50 ప్రవేశ రుసుము నిర్ణయం. మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా సంస్థకు అప్పగించేందుకు ఆ సంస్థను సంప్రదించాలని నిర్ణయం.

కాకులమానుతిప్ప సమీపంలోని 25 ఏళ్లకు పైబడిన ఘన వ్యర్థాలను బయో-రిమీడియేషన్, బయో-మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి రూ.5 కోట్ల మంజూరుకు ఆమోదం.

భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థల సమగ్ర నిర్వహణ కోసం రూ.2.35 కోట్లతో పనులు కొనసాగించేందుకు నిర్ణయం.

తిరుమలలోని టిబీసీ, ఏటీసీ విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత భవనాలను తొలగించి, వాటి స్థానంలో దాతల సహకారంతో కొత్త భవనాలు నిర్మించేందుకు నిర్ణయం.

2027 సంవత్సరానికి సంబంధించి 10 లక్షల డైరీలు, 13.50 లక్షల 12 పేజీల క్యాలెండర్లు, 75 వేల 6 పేజీల క్యాలెండర్ల ముద్రణకు ఆమోదం.

తిరుమల ఆక్టోపస్ బేస్ క్యాంప్‌లో అదనపు మౌలిక సదుపాయాలు, ఎఫ్‌ఎంఎస్ సేవల కోసం రూ.2.91 కోట్ల మంజూరు.

ఒంటిమిట్ట శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారి మూలవిరాట్టులకు బంగారు కవచాల తయారీ కోసం టీటీడీ ట్రెజరీలోని వెయ్యి గ్రాముల బంగారం వినియోగానికి ఆమోదం.

రూ.17.84 కోట్లతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద యాత్రికుల కోసం 100 గదుల విశ్రాంతి గృహం నిర్మాణానికి టెండర్ల ఆమోదం.

ఒంటిమిట్ట ఆలయం ఈశాన్య మాడవీధి విస్తరణ, యాత్రికుల సౌకర్యాల అభివృద్ధి కోసం 6,103 చదరపు అడుగుల భూమి సేకరణ నిమిత్తం జిల్లా యంత్రాంగానికి రూ.2.11 కోట్ల చెల్లింపునకు ఆమోదం.

తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ మండపంపై సాలహారం నిర్మాణం, మిగిలిన ప్రాకార గోడ నిర్మాణానికి రూ.2.50 కోట్ల టెండర్‌కు ఆమోదం.

ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల నిత్య పారాయణం నిరంతరాయంగా జరిగేలా, రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో కూడా లోకకల్యాణార్థం వేద పారాయణ కార్యక్రమాలను విస్తరించేందుకు వేద పారాయణ స్కీం ద్వారా 791 మంది సంభావన వేద పండితులను నియమించేందుకు నిర్ణయం.

హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల తదితర విభాగాల్లో పనిచేస్తున్న కళాకారుల నైపుణ్యాన్ని బట్టి వారి పారితోషికాలను పెంచేందుకు ఆమోదం.

టీటీడీ క్యాంటీన్ల విభాగంలోని 65 సర్వర్ల పోస్టులను క్యాటరింగ్ సూపర్‌వైజర్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు నిర్ణయం. ఈ సమావేశంలో పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో డా. ఎ. శరత్, సీవీఎస్‌వో మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

TTD, TTD Board Meeting, B.R. Naidu, Donor Privileges, New Donor Policy, Trusts and Schemes
New Guidelines, Effective from Midnight, SSD Devotees
 

By
en-us Political News

  
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్.. దానినుంచి బయటపడేందుకు డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అగ్రరాజ్యం విధించే కఠినమైన వ్యూహాత్మక నిబంధనలకు తలవొగ్గుతూ తన సొంత రక్షణ వ్యవస్థను పరాధీనం చేసుకుంటోందన్నది ఆ కథనాల సారాంశం.
మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతలు మరియు వంద డాలర్లు దాటిన క్రూడాయిల్ ధరల మధ్య భారత స్టాక్ మార్కెట్లు అద్భుత రికవరీ సాధించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24100 మార్కును దాటింది. మార్కెట్ తదుపరి గమనంపై విశ్లేషకుల అంచనాలు మీకోసం.
స్విట్జర్లాండ్‌లోని ETH జ్యూరిచ్ శాస్త్రవేత్తలు గిటార్ సూత్రాంతర్భాగంగా పనిచేసే సరికొత్త వేలి గోరు పరిమాణపు క్వాంటం చిప్‌ను ఆవిష్కరించారు. ఈ చిప్ విద్యుదయస్కాంత తరంగాల కంటే 1,00,000 రెట్లు చిన్న శబ్ద ప్రకంపనలను ఉపయోగించి డేటాను భద్రపరుస్తుంది, ఇది క్వాంటం ర్యామ్ (QRAM) పరిశోధనలో ఒక పెద్ద మైలురాయి.
స్కల్‌కాండీ సరికొత్త ప్రీమియం హెడ్‌ఫోన్స్ Crusher 1080 ANC విడుదల చేసింది. బోస్ సంస్థకు చెందిన బెస్ట్ ఇన్ క్లాస్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పేషియల్ ఆడియో ఫీచర్లతో, 60 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో సగం ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ గ్యాడ్జెట్ పూర్తి వివరాలు చూడండి.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గోల్ఫ్ టోర్నమెంట్ ది ఓపెన్ 2026 రాయల్ బర్క్‌డేల్‌లో ప్రారంభమైంది. స్కాటీ షెఫ్లర్, రోరీ మెక్‌ఇల్రాయ్ తలపడుతున్న ఈ మెగా ఈవెంట్‌ను మొబైల్ మరియు టీవీల్లో ఉచితంగా ఎలా చూడాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికా ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) 25% ఘోర పతనాన్ని చవిచూసినప్పటికీ, మెరుగైన క్యూ1 ఫలితాల అండతో భారతీయ ఐటీ షేర్లు మార్కెట్లో నిలదొక్కుకున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బంగారం మరియు గ్లోబల్ స్టాక్స్ వైపు మళ్లుతున్న భారతీయ పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన రిస్కులు ఇవే. అమెరికా బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్ ధరలు మరియు భౌగోళిక ఉద్రిక్తతల వల్ల మీ పోర్ట్‌ఫోలియోపై పడే ప్రభావం గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా ఘనవిజయం సాధించిన తర్వాత ఆటగాళ్లు ప్రదర్శించిన లాస్ మాల్బినాస్ సన్ అర్జెంటీనాస్ బ్యానర్ ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైంది. 1982 ఫాక్‌లాండ్ యుద్ధ గాయాలను రేపిన ఈ నినాదం వెనుక ఉన్న అసలు కథ, ఫిఫా నిబంధనలు మరియు అర్జెంటీనా జట్టు ఎదుర్కోబోయే చర్యల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఈ 14 దేశాల ఉమ్మడి కూటమికి యూరోపియన్ యూనియన్ పూర్తి మద్దతును ప్రకటించింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని, ఎలాంటి బలవంతపు లేదా సైనిక చర్యలకు పాల్పడకూడదని ఈ ప్రకటనలో ఆ దేశాలు విస్పష్టంగా పేర్కొన్నాయి.
ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో భారీ మార్పులను ప్రకటించింది. 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో సూపర్‌ 7 దశ, 2028 టీ20 వరల్డ్‌ కప్‌లో సూపర్‌ 10 దశతో సరికొత్త ఫార్మాట్‌లను తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
19 ఏళ్ల క్రితం లియోనెల్ మెస్సీ చేతుల్లో పెరిగిన లామిన్ యమాల్, ఇప్పుడు 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో మెస్సీ అర్జెంటీనా జట్టుకే సవాల్ విసురుతున్నాడు. ఈ అద్భుతమైన ఫుట్‌బాల్ కథనం మీకోసం.
భారత్ vs ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. తొలి వన్డేలో అక్షర్ పటేల్, గిల్ రాణించడంతో గెలిచిన టీమిండియా, నేడు కార్డిఫ్‌లో సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్, వాతావరణ అంచనాలు మరియు భారత తుది జట్టు Probable Playing XI వివరాలు ఇక్కడ చూడండి.
ఈ వరద బీభత్సానికి 39 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది గల్లంతయ్యారు. నానింగ్‌లో ఒక ప్రధాన రిజర్వాయర్ కట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో వరద ఉధృతి అనూహ్యంగా పెరిగిపోయింది. రిజర్వాయర్ నీరు ఊళ్ళపైకి దూసుకురావడంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా పెరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.