బీహారీ ఆఫీస‌ర్ల‌కు కోపమొచ్చింది.. కానీ...

Publish Date:Mar 3, 2022

Advertisement

అంటే, అన్నారంటారు. కానీ, చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్లుగా, ప్రకటనలు చేస్తే, ఎవరైనా ఏమి సార్లు మీరు నిజంగా ఐఎఎస్ చేశారా? అని అడగరా, అడుగుతారు. అదే అడుగుతున్నారు సామాన్య జనం. విషయం ఏమంటే, తెలంగాణలో ఐఎఎస్’ ల పోస్టింగుల గురించి, కొందరు ఐఎఎస్’ల ప్రవర్తన గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, 1200 మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీహారు బాబులు ఏలుతున్నారనే, ఆవేదన తెలంగాణ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులే  కాదు సామాన్యులు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇదలా ఉంటే పుండు మీద కారం చల్లినట్లు, బీహరుకే చెందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్’కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తు పీటవేసి, తెలంగాణ ఉద్యోగులు,అధికారులు,ప్రజల మనోభావాలను దెబ్బ తీశారనే చర్చకు ఆస్కారం కల్పించారు.

ఈ నేపద్యంలో, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరి కొందరు ముఖ్యనేతలు, ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ అధికార్లను అవమాన పరుస్తూ, సీఎస్, డీజీపీ, సహా కీలక శాఖల బాధ్యతలను బీహారు బాబులకే ఇస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి బీహారుకు చెందిన ఐఏఎస్ అధికారులను రక్షణ వలయంగా చేసుకుని, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీహారీ పాలన సాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి బీహారు బాబులకు ప్రధాన్యత ఇవ్వడంతో  తెలంగాణ ప్రాంత అధికారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్రమాలకు సహకరించే ఐఏఎస్‌లకు కీలక పోస్టులు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి తమదైన స్టైల్లో తప్పు పట్టారు.

అయితే ఉన్నమాటంటే ఉలుకెక్కువ అన్నట్లుగా, ఊరు పేరు లేని, తెలంగాణ స్టేట్ ఐఎఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్, రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా, తెలంగాణలో సాగుతున్న బీహారు బాబుల ఆధిపత్యానికి సంబంధించి రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే చిత్రం ఏమంటే, అసలు అ ప్రకటన చేసింది ఎవరో, వారి ఊరేమిటో, పేరేమిటో కూడా చెప్పుకోలేదు. ఆ ప్రకటన ‘దారిన పోయే దానయ్య’ విడుదల చేసిన ప్రకటనలాగా పైన ఆర్గనైజేషన్ పేరు ఉందే తప్ప కింద ఎవరి సంతకం లేదు. సంతకం కాదు, అసలు పేరే లేదు. 

బీహారు ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న రాజకీయ నాయకులకు అఖిల భారత సర్వీస్ అధికారుల నియామక విధివిధానాలు, స్వభావం గురించి  అవగాహన లేదని అవహేళన చేసిన, ఐఎఎస్ అధికారులకు, తాము విడుదల చేసిన ప్రకటన తమదే అని ద్రువీకరించే సంతకం చేయాలనే కనీస అవగాహన లేక పోవడం చిత్రంగా ఉందని అంటున్నారు. అంతే కాదు, ఇదీ కూడా బీహారీ బాబుల పనే కావచ్చని, అందుకే ఎక్కడా, ఎవరి పేరు లేకుండా, ప్రకటన విడుదల చేశారని తెలాంగాణ గడ్డన పుట్టిన అధికారాలు అంటున్నారు.  ఏమో తెలంగాణ నయా బీహార్’ గా మారుతున్న క్రమంలో ఏమైనా జరగ వచ్చని  అధికారులే అంటున్నారు.

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.