సెల‌వుల్లో తెలంగాణ డీజీపీ.. ఏపీలో అలా!.. ఏం జ‌రుగుతోంది?

Publish Date:Feb 19, 2022

Advertisement

ఇంచుమించు ఒకే స‌మ‌యంలో రెండు ప‌రిణామాలు. అవి కూడా రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీల విష‌యంలో జ‌ర‌గ‌డం కాక‌తాళీయం. ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌పై అనూహ్యంగా వేటు వేసింది ఏపీ స‌ర్కారు. ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వ‌కుండా.. డీజీపీ ప‌ద‌వి నుంచి త‌ప్పించి అవ‌మానించింది. ఆ త‌ర్వాత ఆయ‌న‌తో బ‌ల‌వంతంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించేలా.. ఏపీపీఎస్సీ ఛైర్మ‌న్‌గా నియ‌మించింది. అలా, ఏపీలో డీజీపీ ఎపిసోడ్ తీవ్ర చ‌ర్చ‌ణీయాంశం అవుతుండ‌గా.. ఇదే స‌మ‌యంలో తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి సెల‌వుల్లో వెళ్ల‌డంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిప‌డ్డారు. 

డీజీపీ స‌వాంత్ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి న‌మ్మిన‌బంటులా ప‌ని చేశార‌ని అంటారు. ఇక‌, తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి సైతం సీఎం కేసీఆర్ న‌మ్మ‌కాన్ని ఒప్పు చేయ‌కుండా ప‌ని చేస్తున్నారు. అలాంటిది.. స‌డెన్‌గా డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి సెల‌వుల్లో ఎందుకు వెళ్లార‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. కేసీఆర్‌తో విభేదాలు వ‌చ్చాయా? అలిగి సెల‌వు పెట్టారా? ఇలా అనేక అనుమానాలు. అస‌లు విష‌యం ఏంట‌ని ఆరా తీస్తే.. అప్పుడు తెలిసింది కార‌ణ‌మేంటో. 

తెలంగాణ రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి అనారోగ్య కార‌ణాల‌తో సెలవులో వెళ్లారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోగ్య కారణాలతో సెలవు పెట్టటం ఇదే మొద‌టిసారి. ఈ నెల18 నుంచి మార్చి 4 వరకు ఆయన సెలవులో ఉండనున్నారు. ఆయన స్థానంలో గతంలో హైదరాబాద్ సీపీగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీగా వ్యవహరిస్తున్న అంజనీకుమార్ కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఒకవైపు ఏపీ డీజీపీని అనూహ్యంగా మార్చటం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఉత్కంఠ‌గా మారితే.. ఇలాంటి సమయంలోనే..  తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సెలవుపై వెళ్లటంతో.. కారణం ఏమిటి? అసలేం జరిగింది? అంటూ అంతా ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. అయితే, గురువారం రాత్రి డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి త‌న ఇంట్లోని బాత్రూంలో జారి పడినట్టుగా తెలిసింది. ఆ ప్ర‌మాదంలో ఆయన ఎడమ చేయికి ఫ్యాక్చర్ అయినట్టు సమాచారం. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించగా.. 15 రోజుల పాటు మెడికల్ లీవ్‌ తీసుకున్నారు. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి సెల‌వుల‌కు రీజ‌న్ తెలీడంతో.. హ‌మ్మ‌య్య‌.. ఏపీలా కాలేదులేన‌ని అంతా రిలాక్స్‌ అయ్యారు.  

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.